విరిగినట్టి బండివారే వెఱ్ఱివారుగాక నీవు
(॥పల్లవి॥)
విరిగినట్టి బండివారే వెఱ్ఱివారుగాక నీవు
యెరవు సతము సేసుకొంటి వేమి సేతువే
(॥విరి॥)
సొలిఁతి నీవు అతనిఁ బలువంబోఇనట్టిపొద్దు లేడ
నిలువుఁజెమటతోడియలపు నీకిదేడదే
వెలుఁగు చేను మేసినట్టివిధము దోఁచె నీ యందు
అలసిసొలసి నిన్ను నిఁక నాడనేఁటికే
(॥విరి॥)
యింతి నేను విరహమునను యెదురు చూచుటేడ; నీవు
వింతపులకగముల విఱ్ఱివీఁగు టేఁటిదే
కంతుసంచకారులోనె కల్ల దోఁచె నీయందు
మంతనమున నీతోడిమాట లేఁటిదే
(॥విరి॥)
వనిత శ్రీవేంకటేశ్వరుఁడు దానే నన్నుఁ గూడె
చనవిమనవి నితనితోడి సన్నలేఁటికే
తనరి వీఁపు గానరాఁగ దాఁగినట్టి చందమాయ
వెనక నాకుఁ బ్రియము చెప్పి వేఁడనేఁటికే
(||pallavi||)
viriginaṭṭi baṁḍivāre vĕṭrivārugāga nīvu
yĕravu sadamu sesugŏṁṭi vemi seduve
(||viri||)
sŏlim̐ti nīvu adanim̐ baluvaṁboinaṭṭibŏddu leḍa
niluvum̐jĕmaḍadoḍiyalabu nīgideḍade
vĕlum̐gu senu mesinaṭṭividhamu dom̐sĕ nī yaṁdu
alasisŏlasi ninnu nim̐ka nāḍanem̐ṭige
(||viri||)
yiṁti nenu virahamunanu yĕduru sūsuḍeḍa; nīvu
viṁtabulagagamula viṭrivīm̐gu ṭem̐ṭide
kaṁtusaṁchagārulonĕ kalla dom̐sĕ nīyaṁdu
maṁtanamuna nīdoḍimāḍa lem̐ṭide
(||viri||)
vanida śhrīveṁkaḍeśhvarum̐ḍu dāne nannum̐ gūḍĕ
sanavimanavi nidanidoḍi sannalem̐ṭige
tanari vīm̐pu gānarām̐ga dām̐ginaṭṭi saṁdamāya
vĕnaga nāgum̐ briyamu sĕppi vem̐ḍanem̐ṭige