Viṟigi paarediyatti veeridi yo ribulaala

విఱిగి పారెడియట్టి వీరిడి యో రిపులాల
Language

(॥పల్లవి॥)
విఱిగి పారెడియట్టి వీరిడి యో రిపులాల
తఱి శరణు చొరరో దండాలు వెట్టరో

(॥విఱి॥)
వీఁడె వచ్చెఁ గృష్ణుఁడిదె వేయరో కైదువులు
కాఁగినపోట్లు రాఁగీ కదియకురో
పోఁడిమితో భీతివాయ పూరి నోళ్లఁ గరవరో
ఆఁడువార మనుకోరో ఆతఁడు దడవఁడు

(॥విఱి॥)
గోవిందుఁడు దాడివచ్చె గునుకుచుఁ బారరో
కావు మని మెడలఁ బాగలు వేయరో
వేవేగ బిడ్డలఁ బేర్లు విభునికిఁ బెట్టరో
వో వో యెంగిలికిఁ జేతు లొగ్గరో రక్షించీని

(॥విఱి॥)
మొత్తీ శ్రీవేంకటేశుఁడు మూలలకు దాఁగరో
వొత్తిలి పంతములిచ్చి మీ రోడఁగదరో
హత్తి మీతలలు విరియఁగఁ బోసుకొనరో
బొత్తుగా మిమ్ము గెలిచెఁ బొగడరో మెచ్చీని

(||pallavi||)
viṟigi pārĕḍiyaṭṭi vīriḍi yo ribulāla
taṟi śharaṇu sŏraro daṁḍālu vĕṭṭaro

(||viṟi||)
vīm̐ḍĕ vachchĕm̐ gṛṣhṇum̐ḍidĕ veyaro kaiduvulu
kām̐ginaboṭlu rām̐gī kadiyaguro
pom̐ḍimido bhīdivāya pūri noḽlam̐ garavaro
ām̐ḍuvāra manugoro ādam̐ḍu daḍavam̐ḍu

(||viṟi||)
goviṁdum̐ḍu dāḍivachchĕ gunugusum̐ bāraro
kāvu mani mĕḍalam̐ bāgalu veyaro
vevega biḍḍalam̐ berlu vibhunigim̐ bĕṭṭaro
vo vo yĕṁgiligim̐ jedu lŏggaro rakṣhiṁchīni

(||viṟi||)
mŏttī śhrīveṁkaḍeśhum̐ḍu mūlalagu dām̐garo
vŏttili paṁtamulichchi mī roḍam̐gadaro
hatti mīdalalu viriyam̐gam̐ bosugŏnaro
bŏttugā mimmu gĕlisĕm̐ bŏgaḍaro mĕchchīni