Viridammivaamdeya virahamu vemdeya

విరిదమ్మివాఁడేయ విరహము వేఁడేయ
Language

(॥పల్లవి॥)
విరిదమ్మివాఁడేయ విరహము వేఁడేయ
పరగ నాతనికి పంతమియ్యరాదా

(॥విరి॥)
వేఁడుకొనేవు చెలుల విభునిఁ గూరుచుమని
వేఁడుకోరాదా ఆ విభుని నీవే
పోఁడిమిఁ బగవట్టేవు పున్నమచందురు మీఁద
నేఁడే యీతని పాదాలు నీవు వట్టుకోరాదా

(॥విరి॥)
మరుని మీదుదీసి మరి మొక్కుకొనేదాన-
వరసి మొక్కఁగరాదా ఆతనికిని
బెరసి కోవిలలకు ప్రియముచెప్పేదానవు
సిరలు నాతనికే చెప్పరాదా ప్రియము

(॥విరి॥)
మంతనానఁ జిలుకతో మాటలాడేదానవు
ఇంతలో మాటాడరాదా యీతనితోనే
అంతటా శ్రీవేంకటేశుఁ డాతఁడే నిన్నుఁ గూడె
రంతు సేసేటిదానవు రతి సేయరాదా

(||pallavi||)
viridammivām̐ḍeya virahamu vem̐ḍeya
paraga nādanigi paṁtamiyyarādā

(||viri||)
vem̐ḍugŏnevu sĕlula vibhunim̐ gūrusumani
vem̐ḍugorādā ā vibhuni nīve
pom̐ḍimim̐ bagavaṭṭevu punnamasaṁduru mīm̐da
nem̐ḍe yīdani pādālu nīvu vaṭṭugorādā

(||viri||)
maruni mīdudīsi mari mŏkkugŏnedāna-
varasi mŏkkam̐garādā ādanigini
bĕrasi kovilalagu priyamusĕppedānavu
siralu nādanige sĕpparādā priyamu

(||viri||)
maṁtanānam̐ jilugado māḍalāḍedānavu
iṁtalo māḍāḍarādā yīdanidone
aṁtaḍā śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninnum̐ gūḍĕ
raṁtu seseḍidānavu radi seyarādā