Virahini modalane veeri votlimka nela

విరహిణి మొదలనే వీరి వొట్లిఁక నేల
Language

(॥పల్లవి॥)
విరహిణి మొదలనే వీరి వొట్లిఁక నేల
తరుణికి శృంగారాలు తగినవే సేయరే

(॥విరహి॥)
అలినీలవేణికి నది యేలే సంపెంగలు
అలరుదామెరవిరు లగుఁ గాక
పొలసి పికవాణికి వుయ్యకురే జవ్వాది
చిలుకు చిగురు బంతి చేతి కియ్యరే

(॥విరహి॥)
దంతియానకు సింహలఁ దగ వ్రాసిన చీరేలే
చెంతలనే లతల మంజిష్టి గాక
రంతుఁ గలువకంటికి రవిపదక మిదేలే
పంతముతోడ చంద్రాభరణము లిడరే

(॥విరహి॥)
వడి నీపె గిరికుచవజ్రాల సేస లేలే
అడరుఁ బూవులసేసే అమరుఁ గాక
బడి శ్రీవేంకటేశుఁడు పడఁతినిఁ గూడె నింక
కడుఁ గుంకుమపూతేలే గందవొడి చల్లరే

(||pallavi||)
virahiṇi mŏdalane vīri vŏṭlim̐ka nela
taruṇigi śhṛṁgārālu taginave seyare

(||virahi||)
alinīlaveṇigi nadi yele saṁpĕṁgalu
alarudāmĕraviru lagum̐ gāga
pŏlasi pigavāṇigi vuyyagure javvādi
silugu siguru baṁti sedi kiyyare

(||virahi||)
daṁtiyānagu siṁhalam̐ daga vrāsina sīrele
sĕṁtalane ladala maṁjiṣhṭi gāga
raṁtum̐ galuvagaṁṭigi ravibadaga midele
paṁtamudoḍa saṁdrābharaṇamu liḍare

(||virahi||)
vaḍi nībĕ girigusavajrāla sesa lele
aḍarum̐ būvulasese amarum̐ gāga
baḍi śhrīveṁkaḍeśhum̐ḍu paḍam̐tinim̐ gūḍĕ niṁka
kaḍum̐ guṁkumabūdele gaṁdavŏḍi sallare