(॥పల్లవి॥)
విరహమునకు నీవు వెరవవద్దు
గరిమ నేపొద్దూ నివే కాపులు నీకును
(॥॥)
చెంగలువబంతి నీవు చేతఁ బట్టుకొనవే
సంగతి నాతనిమేనిచాయల దది
ముంగిటితామర లురమున నొత్తుకోవే
రంగుగాఁ జెలువుని నేత్రములఁ బోలు నవి
(॥॥)
కనకపు సొమ్ములెల్లా కాయముపై నించుకోవే
ఘనుని పీతాంబరపుకాంతులఁ బోలు
పెనచి మాణికములుపేరు మెడ వేసుకోవే
కనుఁ గొంటే నాతనికౌస్తుభముజాతివి
(॥॥)
చేవమీర ముంజేతిచిలుకతో మాఁటాడవే
భావింప నాతఁ డెక్కేపక్షికులము
కోవరపు నీచనుఁ గొండ లిట్టె చూపవే
యీవేళ శ్రీవేంకటేశుఁ డేలె నిన్నును
(||pallavi||)
virahamunagu nīvu vĕravavaddu
garima nebŏddū nive kābulu nīgunu
(||||)
sĕṁgaluvabaṁti nīvu sedam̐ baṭṭugŏnave
saṁgadi nādanimenisāyala dadi
muṁgiḍidāmara luramuna nŏttugove
raṁgugām̐ jĕluvuni netramulam̐ bolu navi
(||||)
kanagabu sŏmmulĕllā kāyamubai niṁchugove
ghanuni pīdāṁbarabugāṁtulam̐ bolu
pĕnasi māṇigamuluberu mĕḍa vesugove
kanum̐ gŏṁṭe nādanigaustubhamujādivi
(||||)
sevamīra muṁjedisilugado mām̐ṭāḍave
bhāviṁpa nādam̐ ḍĕkkebakṣhigulamu
kovarabu nīsanum̐ gŏṁḍa liṭṭĕ sūbave
yīveḽa śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnunu