Virahamu valavadu rasigulu vinaro saadusum jeppeda

విరహము వలవదు రసికులు వినరో చాటుచుఁ జెప్పెద
Language

(॥పల్లవి॥)
విరహము వలవదు రసికులు వినరో చాటుచుఁ జెప్పెద
తరితీపను చెఱకున నిత్తరిఁ బండువండె నిదె

(॥విర॥)
బగి వాయఁగరా దిఁక దంపతులకు నెక్కడ చూచిన
చిగురుకుఁ జేఁగలు వచ్చెను చిత్తజురాజ్యమున
తగిలి తగిలి కోవిలకూఁతలు మొగసాలలకెక్కెను
జగమున విరసపుఁబవనుఁడు చల్లవివాఁడాయ

(॥విర॥)
పొసఁగఁగ నెవ్వరికైనను పొందులె జరపఁగ వలసెను
పసిమొగ్గలు వాడెక్కెను వసంతకాలమున
ముసగస లాడెడు తుమ్మిద మోతల చలములు చెల్లెను
సుసరముననె పగరాజును చుట్టమువాఁడాయ

(॥విర॥)
కలఇకలే కలకాలము కాణాచులుగాఁ బరగెను
ఇలలో శ్రీవేంకటపతియిచ్చిన సంపదను
యెలమిని పదారువేలకు ఇతఁడే మగఁడై నిలిచెను
కలగొని మనసనియెడి చెలికాఁడునుఁ దోడాయ

(||pallavi||)
virahamu valavadu rasigulu vinaro sāḍusum̐ jĕppĕda
taridībanu sĕṟaguna nittarim̐ baṁḍuvaṁḍĕ nidĕ

(||vira||)
bagi vāyam̐garā dim̐ka daṁpadulagu nĕkkaḍa sūsina
sigurugum̐ jem̐galu vachchĕnu sittajurājyamuna
tagili tagili kovilagūm̐talu mŏgasālalagĕkkĕnu
jagamuna virasabum̐bavanum̐ḍu sallavivām̐ḍāya

(||vira||)
pŏsam̐gam̐ga nĕvvarigainanu pŏṁdulĕ jarabam̐ga valasĕnu
pasimŏggalu vāḍĕkkĕnu vasaṁtagālamuna
musagasa lāḍĕḍu tummida modala salamulu sĕllĕnu
susaramunanĕ pagarājunu suṭṭamuvām̐ḍāya

(||vira||)
kala̮igale kalagālamu kāṇāsulugām̐ baragĕnu
ilalo śhrīveṁkaḍabadiyichchina saṁpadanu
yĕlamini padāruvelagu idam̐ḍe magam̐ḍai nilisĕnu
kalagŏni manasaniyĕḍi sĕligām̐ḍunum̐ doḍāya