Virahamu meemdane veduga vellivirisee

విరహము మీఁదనే వేడుక వెల్లివిరిసీ
Language

(॥పల్లవి॥)
విరహము మీఁదనే వేడుక వెల్లివిరిసీ
నిరతి నెండలలోనే నీడలు గలిగేనే

(॥॥)
చెక్కునఁ బెట్టి న చేయి సెలవి నవ్విన నవ్వు
వొక్కమాటే నీకు నెందుండి వచ్చెనే
లక్కవంటి దీ మనసు చొక్కువంటిదీ వలపు
గక్కనఁ బతిఁ గంటేనే కల భెరుకాయనే

(॥॥)
మోవి మీఁది వసివాడు మొగముపై చెంగలింపు
యీవల రెండూ జవళి నెట్టు గల్గెనే
పూవు వంటిది యాస పూఁప వంటిది పొందు
నీ విభుఁడు రాఁగాను నిండు దోమ టాయనే

(॥॥)
చన్నులఁ బయ్యద జారు సరిఁ గన్నుఁగవ సిగ్గు
యెన్న నొకటొకటికి నెనయు టెట్టే
యిన్నిటా శ్రీ వేంకటేశుఁడింతలోనే నినుఁగూడే
సన్నల నితని వల్ల సరిబేసు లాయనే

(||pallavi||)
virahamu mīm̐dane veḍuga vĕllivirisī
niradi nĕṁḍalalone nīḍalu galigene

(||||)
sĕkkunam̐ bĕṭṭi na seyi sĕlavi navvina navvu
vŏkkamāḍe nīgu nĕṁduṁḍi vachchĕne
lakkavaṁṭi dī manasu sŏkkuvaṁṭidī valabu
gakkanam̐ badim̐ gaṁṭene kala bhĕrugāyane

(||||)
movi mīm̐di vasivāḍu mŏgamubai sĕṁgaliṁpu
yīvala rĕṁḍū javaḽi nĕṭṭu galgĕne
pūvu vaṁṭidi yāsa pūm̐pa vaṁṭidi pŏṁdu
nī vibhum̐ḍu rām̐gānu niṁḍu doma ṭāyane

(||||)
sannulam̐ bayyada jāru sarim̐ gannum̐gava siggu
yĕnna nŏgaḍŏgaḍigi nĕnayu ṭĕṭṭe
yinniḍā śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone ninum̐gūḍe
sannala nidani valla saribesu lāyane