Virahame tomsadu vibhumda needo naagu

విరహమే తోఁచదు విభుఁడ నీతో నాకు
Language

(॥పల్లవి॥)
విరహమే తోఁచదు విభుఁడ నీతో నాకు
మరిగిన యిటువంటి మరు లెటువంటివో

(॥విర॥)
తక్కక యేపొద్దు నాకుఁ దగులైవుందువుగన
పక్కనున్నట్టే వుందువు పాసివున్నాను
అక్కరతో ముచ్చటాడే అలవాటు గద్దుగన
వొక్కటైమాటాడినట్టేవుందు వూరకుండినాను

(॥విర॥)
కాచు కెప్పుడు మోమునఁ గట్టినట్టుందువుగన
చూచినట్టుందువు నీవు చూడకున్నాను
యేచి కలలోనా నీవే యెనసివుందువుగన
యీచొప్పే మతిలో నుండు యే పరాకైనాను

(॥విర॥)
యెలమి నాఇంటిలోనే ఇరవై వుందువుగన
తలఁపులోనే వుందువు దండనున్నాను
అలరి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
అలముకుందువు నీ వరుదైవున్నాను

(||pallavi||)
virahame tom̐sadu vibhum̐ḍa nīdo nāgu
marigina yiḍuvaṁṭi maru lĕḍuvaṁṭivo

(||vira||)
takkaga yebŏddu nāgum̐ dagulaivuṁduvugana
pakkanunnaṭṭe vuṁduvu pāsivunnānu
akkarado muchchaḍāḍe alavāḍu gaddugana
vŏkkaḍaimāḍāḍinaṭṭevuṁdu vūraguṁḍinānu

(||vira||)
kāsu kĕppuḍu momunam̐ gaṭṭinaṭṭuṁduvugana
sūsinaṭṭuṁduvu nīvu sūḍagunnānu
yesi kalalonā nīve yĕnasivuṁduvugana
yīsŏppe madilo nuṁḍu ye parāgainānu

(||vira||)
yĕlami nāiṁṭilone iravai vuṁduvugana
talam̐pulone vuṁduvu daṁḍanunnānu
alari śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
alamuguṁduvu nī varudaivunnānu