Virahame koodaina vetrivaaramu

విరహమే కూడైన వెఱ్ఱివారము
Language

(॥పల్లవి॥)
విరహమే కూడైన వెఱ్ఱివారము
యిరవైతివింకా మమ్మునేమి సేసేవో

(॥విర॥)
యెదురు చూపించుకొంటివిందాఁకా నాచేత
వెదకింపించుకొంటివి వేగుదాఁకాను
కొదదీర మాయింటికి కోరి యిట్టే విచ్చేసితిఁ
విదివో ఇంకా మమ్మునేమిసేసేవో

(॥విర॥)
వలపించుకొంటివిదె వాడలలో మాచేతఁ
బిలిపించుకొంటివిట్టె బిగియుచును
తలఁ పెరిఁగి యంతలో దగ్గర విచ్చేసితివి
యెలయింపులనె యింకానేమిసేసేవో

(॥విర॥)
మొక్కించుకొంటివి ముందరనే మాచేత
దక్కించుకొంటిమి మాతమకములు
గక్కునఁ గూడితివిదె కమ్మటి శ్రీవేంకటేశ
యిక్కువలంటేవింకా నేమిసేసేవో

(||pallavi||)
virahame kūḍaina vĕṭrivāramu
yiravaidiviṁkā mammunemi sesevo

(||vira||)
yĕduru sūbiṁchugŏṁṭiviṁdām̐kā nāseda
vĕdagiṁpiṁchugŏṁṭivi vegudām̐kānu
kŏdadīra māyiṁṭigi kori yiṭṭe vichchesidim̐
vidivo iṁkā mammunemisesevo

(||vira||)
valabiṁchugŏṁṭividĕ vāḍalalo māsedam̐
bilibiṁchugŏṁṭiviṭṭĕ bigiyusunu
talam̐ pĕrim̐gi yaṁtalo daggara vichchesidivi
yĕlayiṁpulanĕ yiṁkānemisesevo

(||vira||)
mŏkkiṁchugŏṁṭivi muṁdarane māseda
dakkiṁchugŏṁṭimi mādamagamulu
gakkunam̐ gūḍidividĕ kammaḍi śhrīveṁkaḍeśha
yikkuvalaṁṭeviṁkā nemisesevo