Virahadaabamuseda visige nimdaamkaanu

విరహతాపముచేత విసిగె నిందాఁకాను
Language

(॥పల్లవి॥)
విరహతాపముచేత విసిగె నిందాఁకాను
యిరవై మొక్కులు మొక్కీ నిదివో నీ దేవుఁడు

(॥విర॥)
చెంపలఁ జెమటఁగారీ సెలవుల సిగ్గు లూరీ
గుంపుగట్టి మూఁపుమీఁదఁ గొప్పుజారీని
పెంపుడుఁజిలుక చేత పీఁటమీఁదఁగూచున్నది
ఇంపుతోడఁ జిత్తగించు ఇదివో నీ దేవుడు

(॥విర॥)
మోమునఁ గళలుమూఁగీ ముక్కన నిట్టూర్పు రేఁగీ
వేమరుఁ జన్ను లురాన విఱ్ఱవీఁగీని
తామెరపువ్వు ధరించి దండనె కాచుకున్నది
యేమని మాటాడవయ్య ఇదివో నీ దేవుఁడు

(॥విర॥)
కాయమెల్లా బులకించీ కాఁగిలిరతికిఁ బొంచీ
తీయని కెమ్మోవిమీఁద తేనెలు మించీ
పాయపు శ్రీవేంకటేశ పానుపుపై నిన్నుఁగూడె
యీయెడ నలమేల్మంగ ఇదివో నీ దేవుఁడు

(||pallavi||)
virahadābamuseda visigĕ niṁdām̐kānu
yiravai mŏkkulu mŏkkī nidivo nī devum̐ḍu

(||vira||)
sĕṁpalam̐ jĕmaḍam̐gārī sĕlavula siggu lūrī
guṁpugaṭṭi mūm̐pumīm̐dam̐ gŏppujārīni
pĕṁpuḍum̐jiluga seda pīm̐ṭamīm̐dam̐gūsunnadi
iṁpudoḍam̐ jittagiṁchu idivo nī devuḍu

(||vira||)
momunam̐ gaḽalumūm̐gī mukkana niṭṭūrbu rem̐gī
vemarum̐ jannu lurāna viṭravīm̐gīni
tāmĕrabuvvu dhariṁchi daṁḍanĕ kāsugunnadi
yemani māḍāḍavayya idivo nī devum̐ḍu

(||vira||)
kāyamĕllā bulagiṁchī kām̐giliradigim̐ bŏṁchī
tīyani kĕmmovimīm̐da tenĕlu miṁchī
pāyabu śhrīveṁkaḍeśha pānububai ninnum̐gūḍĕ
yīyĕḍa nalamelmaṁga idivo nī devum̐ḍu