(॥పల్లవి॥)
విరహతాపము మాన్పవే నీవు
సిరుల తోడుత సేవసేసే నేను
(॥విర॥)
తలపోసి తనలోనే తమకమందీఁ జెలి
పిలిచి తేఁగదవే ప్రియుని నీవు
చెలపచెమటలివే చెక్కులనే వడిసీని
వెలయ సురటిఁ గొని విసరే నేను
(॥విర॥)
యెదురుచూపులనే యింతి పరాకై వున్నది
కదియించఁ గదవే కాంతునిని
పొదలుఁ దాపపువేఁడి పొరిఁబొరి ముంచీని
సదరానఁ బన్నీరు చల్లే నేను
(॥విర॥)
కూడేటి రతివేడుక కొమ్మ పులకించె నిదే
యీడనే శ్రీవేంకటేశు నెచ్చరించవే
వోడక యీగోవిందుఁడే వొడయఁడై యీకె నేలె
జోడై నీవలెనే కాచుకవుండే నేను
(||pallavi||)
virahadābamu mānpave nīvu
sirula toḍuda sevasese nenu
(||vira||)
talabosi tanalone tamagamaṁdīm̐ jĕli
pilisi tem̐gadave priyuni nīvu
sĕlabasĕmaḍalive sĕkkulane vaḍisīni
vĕlaya suraḍim̐ gŏni visare nenu
(||vira||)
yĕdurusūbulane yiṁti parāgai vunnadi
kadiyiṁcham̐ gadave kāṁtunini
pŏdalum̐ dābabuvem̐ḍi pŏrim̐bŏri muṁchīni
sadarānam̐ bannīru salle nenu
(||vira||)
kūḍeḍi radiveḍuga kŏmma pulagiṁchĕ nide
yīḍane śhrīveṁkaḍeśhu nĕchchariṁchave
voḍaga yīgoviṁdum̐ḍe vŏḍayam̐ḍai yīgĕ nelĕ
joḍai nīvalĕne kāsugavuṁḍe nenu