Virahaana numdinaanu vedugale putte naagu

విరహాన నుండినాను వేడుకలే పుట్టే నాకు
Language

(॥పల్లవి॥)
విరహాన నుండినాను వేడుకలే పుట్టే నాకు
సరగ నేఁ జేసిన భాగ్య మింక నెట్టి దో

(॥॥)
యెంత తడవు రాకున్నా నెదురె చూతుఁగాని
సొంత నీపై వేసట పుట్టదు నాకు
చింతలు మతి రేఁగినా సెలవి నవ్వుదుఁ గాని
చెంత నుండి నా మొగము చిన్నఁబోవ దందుకూ

(॥॥)
చూడక నీ వెందున్నా నీ సుద్దులే విందుఁ గాని
యీడుకుఁ గోపము రేఁగ దిందుకు నీపై
వీడని నా యాస లెంత వేఁడఁ బొరలించినా
వాడదు నా మేను పై పై వలపిగిరించును

(॥॥)
పరాకున నీ వుండినాఁ బైకొని మొక్కుదుఁ గాని
తరితీపు సేసే వని తప్పయి తోఁచదూ
యిరవై శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
సరి నలయించే వని జడియపు రతులు

(||pallavi||)
virahāna nuṁḍinānu veḍugale puṭṭe nāgu
saraga nem̐ jesina bhāgya miṁka nĕṭṭi do

(||||)
yĕṁta taḍavu rāgunnā nĕdurĕ sūdum̐gāni
sŏṁta nībai vesaḍa puṭṭadu nāgu
siṁtalu madi rem̐ginā sĕlavi navvudum̐ gāni
sĕṁta nuṁḍi nā mŏgamu sinnam̐bova daṁdugū

(||||)
sūḍaga nī vĕṁdunnā nī suddule viṁdum̐ gāni
yīḍugum̐ gobamu rem̐ga diṁdugu nībai
vīḍani nā yāsa lĕṁta vem̐ḍam̐ bŏraliṁchinā
vāḍadu nā menu pai pai valabigiriṁchunu

(||||)
parāguna nī vuṁḍinām̐ baigŏni mŏkkudum̐ gāni
taridību sese vani tappayi tom̐sadū
yiravai śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
sari nalayiṁche vani jaḍiyabu radulu