Virahaana ninnum baasi vegirimche nimdaamkaa

విరహాన నిన్నుఁ బాసి వేగిరించె నిందాఁకా
Language

(॥పల్లవి॥)
విరహాన నిన్నుఁ బాసి వేగిరించె నిందాఁకా
సరుసకు వచ్చి యిఁక సటవట లేలే

(॥విర॥)
పచ్చి చిగురుఁబానుపుపైఁ బొరలేటి పతితో
వెచ్చివేవనిమాటల వెంగెము లేలే
మచ్చిక నీమిఁదిది మరొకతెపై వేసి
గచ్చులకొడిమెలేల కట్టేవే ఆతనికి

(॥విర॥)
పండువెన్నెల బాయిట బడలేటిరమణుపై
యెండలనీడలచూపు లేల చల్లేవే
అండ నీకేదురుచూచే యవ్వలివారిపైఁదోసి
చండిసేశాతనికేల జాలి రేఁచేవే

(॥విర॥)
చిత్తడి చెమటల యీ శ్రీవేంకటేశ్వరుని
మొత్తపుఁ జింతాజలధి ముంచనేఁటికే
యిత్తలను నీవు గడి యెవ్వతెనో పేరుకొనేఁ
వెత్తినచలాన నింకనేల నవ్వేవే

(||pallavi||)
virahāna ninnum̐ bāsi vegiriṁchĕ niṁdām̐kā
sarusagu vachchi yim̐ka saḍavaḍa lele

(||vira||)
pachchi sigurum̐bānububaim̐ bŏraleḍi padido
vĕchchivevanimāḍala vĕṁgĕmu lele
machchiga nīmim̐didi marŏgadĕbai vesi
gachchulagŏḍimĕlela kaṭṭeve ādanigi

(||vira||)
paṁḍuvĕnnĕla bāyiḍa baḍaleḍiramaṇubai
yĕṁḍalanīḍalasūbu lela salleve
aṁḍa nīgedurusūse yavvalivāribaim̐dosi
saṁḍiseśhādanigela jāli rem̐seve

(||vira||)
sittaḍi sĕmaḍala yī śhrīveṁkaḍeśhvaruni
mŏttabum̐ jiṁtājaladhi muṁchanem̐ṭige
yittalanu nīvu gaḍi yĕvvadĕno perugŏnem̐
vĕttinasalāna niṁkanela navveve