విరహాన బడలెను విభుఁడు యిందాఁకాను
(॥పల్లవి॥)
విరహాన బడలెను విభుఁడు యిందాఁకాను
పురుషార్థ మిందువంకఁ బొందేదేమే
(॥విర॥)
కంతుని దీమమవై ఘనుని భ్రమయించేవు
పొంత నిందువంక నేమి పుణ్యమే నీకు
పంతమున వలపించి పలుమారు నలిగేవు
యెంత లాభము గలిగె నిందువంక నీకు
(॥విర॥)
చెఱకు సింగిణివై చెలువుని నేఁచేవు
గుణిగా నెంతధనము గూడెనే నీకు
వెఱగు వడుచు నీవు వెంట వెంటఁ దిప్పేవు
నెఱదొరతన మెంత నేర్చితివె నీవు
(॥విర॥)
పూవులగాలమవై పురుషునిఁ దగిలేవు
వేవే యెంతరాజ్య మేలితిదె నీవు
యీవల శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నిన్నుఁ గూడె
కైవశమై యెంతకొడిగట్టితివె నీవు
(||pallavi||)
virahāna baḍalĕnu vibhum̐ḍu yiṁdām̐kānu
puruṣhārdha miṁduvaṁkam̐ bŏṁdedeme
(||vira||)
kaṁtuni dīmamavai ghanuni bhramayiṁchevu
pŏṁta niṁduvaṁka nemi puṇyame nīgu
paṁtamuna valabiṁchi palumāru naligevu
yĕṁta lābhamu galigĕ niṁduvaṁka nīgu
(||vira||)
sĕṟagu siṁgiṇivai sĕluvuni nem̐sevu
guṇigā nĕṁtadhanamu gūḍĕne nīgu
vĕṟagu vaḍusu nīvu vĕṁṭa vĕṁṭam̐ dippevu
nĕṟadŏradana mĕṁta nersidivĕ nīvu
(||vira||)
pūvulagālamavai puruṣhunim̐ dagilevu
veve yĕṁtarājya melididĕ nīvu
yīvala śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
kaivaśhamai yĕṁtagŏḍigaṭṭidivĕ nīvu