విరహ మొక్కందమాయ విచ్చేయవయ్యా
(॥పల్లవి॥)
విరహ మొక్కందమాయ విచ్చేయవయ్యా
నిరతి నాకెఁ జూచి నీవంటా మొక్కితిమి
(॥విర॥)
చెక్కిటి చెయ్యే చెలికి శేషపరియంక మాయ
జక్కవచన్నులు శంఖచక్రము లాయ
వుక్కచెమటే జలధి వునికి సేసుక నిన్ను
జక్కనిసతి దలఁచి సారుప్య మందె
(॥వర॥)
చలువకస్తూరి పూఁత సరి నీలవర్ణమాయ
మెలుఁత నివ్వెర గనిమిషద్రిష్టాయ
తొలుత చిగురుపాన్పు తులసిపూజాయ నిన్ను
జలజాక్షి తలపోసి సారూప్య మందె
(॥విర॥)
సిరులఁ గట్టినతాళి శ్రీధరభావ మాయ
వరుస వలపు భక్త వత్సల మాయ
యిరవై శ్రీవేంకటేశ యింతలో నీవు గూడఁగా
సరుస నిన్నంటి నాకె సారూప్య మందె
(||pallavi||)
viraha mŏkkaṁdamāya vichcheyavayyā
niradi nāgĕm̐ jūsi nīvaṁṭā mŏkkidimi
(||vira||)
sĕkkiḍi sĕyye sĕligi śheṣhabariyaṁka māya
jakkavasannulu śhaṁkhasakramu lāya
vukkasĕmaḍe jaladhi vunigi sesuga ninnu
jakkanisadi dalam̐si sārupya maṁdĕ
(||vara||)
saluvagastūri pūm̐ta sari nīlavarṇamāya
mĕlum̐ta nivvĕra ganimiṣhadriṣhṭāya
tŏluda sigurubānpu tulasibūjāya ninnu
jalajākṣhi talabosi sārūpya maṁdĕ
(||vira||)
sirulam̐ gaṭṭinadāḽi śhrīdharabhāva māya
varusa valabu bhakta vatsala māya
yiravai śhrīveṁkaḍeśha yiṁtalo nīvu gūḍam̐gā
sarusa ninnaṁṭi nāgĕ sārūpya maṁdĕ