Viraha medade naagu vesa nee karuna gaddu

విరహ మేడదే నాకు వెస నీ కరుణ గద్దు
Language

(॥పల్లవి॥)
విరహ మేడదే నాకు వెస నీ కరుణ గద్దు
అరసి నీ కతల నోలాడుచుందుఁ గాక

(॥॥)
తలఁపులో నీ వుండఁగా తడఁబాటు లేల నాకు
వలపు గలిగుండగా వగ పేల
చెలిమి నీవు సేయఁగా చింతలెల్లాఁ బెడఁ బాసె
పలుమారు సంతోసానఁ బరగుదుఁ గాక

(॥॥)
వేల నీ వుంగర మిదే వేళలు చూడ నేఁటికి
సోలి నీసతులు వీరే సొలయవద్దు
వోలివెట్టి పెండ్లాడితి వొడఁ బరచవలెనా
మేలు తోడిదాననై మెలఁగదుఁ గాక

(॥॥)
నీ పేరు నానోర నిదే నేరములు లేవు నాకు
కాఁపురము నీకుఁ జేసే కడ మెంచను
యే పొద్దు శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
వోపి నన్ను నేలితివి వొనరుదుఁ గాకా

(||pallavi||)
viraha meḍade nāgu vĕsa nī karuṇa gaddu
arasi nī kadala nolāḍusuṁdum̐ gāga

(||||)
talam̐pulo nī vuṁḍam̐gā taḍam̐bāḍu lela nāgu
valabu galiguṁḍagā vaga pela
sĕlimi nīvu seyam̐gā siṁtalĕllām̐ bĕḍam̐ bāsĕ
palumāru saṁtosānam̐ baragudum̐ gāga

(||||)
vela nī vuṁgara mide veḽalu sūḍa nem̐ṭigi
soli nīsadulu vīre sŏlayavaddu
volivĕṭṭi pĕṁḍlāḍidi vŏḍam̐ barasavalĕnā
melu toḍidānanai mĕlam̐gadum̐ gāga

(||||)
nī peru nānora nide neramulu levu nāgu
kām̐puramu nīgum̐ jese kaḍa mĕṁchanu
ye pŏddu śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
vobi nannu nelidivi vŏnarudum̐ gāgā