విరతి గలుగవలె విష్ణుభక్తుఁడు గావలె
(॥పల్లవి॥)
విరతి గలుగవలె విష్ణుభక్తుఁడు గావలె
సరవితో నుండవలె సహజయోగికిని
(॥విరతి॥)
మంతనాన నుండవలె మనసు శోధించవలె
చింతించవలె హరిని చెలఁగవలె
అంతరంగుఁడు గావలె నాసలు మానఁగవలె
సంతోసాన మించవలె సహజయోగికిని
(॥విరతి॥)
వెరవు గలుగవలె వెఱవు లుడుగవలె
యిరవై యెఱుకవలె యెచ్చరవలె
విరసము మానవలె వివేకించుకొనవలె
సరుగ మౌని గావలె సహజయోగికిని
(॥విరతి॥)
భావించుకొనవలె పదరకుండఁగవలె
కావలెఁ బరిపూర్ణుఁడు కరుణవలె
శ్రీవేంకటేశ్వరుని సేవే కలుగవలె
సావధానుఁడు గావలె సహజయోగికిని
(||pallavi||)
viradi galugavalĕ viṣhṇubhaktum̐ḍu gāvalĕ
saravido nuṁḍavalĕ sahajayogigini
(||viradi||)
maṁtanāna nuṁḍavalĕ manasu śhodhiṁchavalĕ
siṁtiṁchavalĕ harini sĕlam̐gavalĕ
aṁtaraṁgum̐ḍu gāvalĕ nāsalu mānam̐gavalĕ
saṁtosāna miṁchavalĕ sahajayogigini
(||viradi||)
vĕravu galugavalĕ vĕṟavu luḍugavalĕ
yiravai yĕṟugavalĕ yĕchcharavalĕ
virasamu mānavalĕ vivegiṁchugŏnavalĕ
saruga mauni gāvalĕ sahajayogigini
(||viradi||)
bhāviṁchugŏnavalĕ padaraguṁḍam̐gavalĕ
kāvalĕm̐ baribūrṇum̐ḍu karuṇavalĕ
śhrīveṁkaḍeśhvaruni seve kalugavalĕ
sāvadhānum̐ḍu gāvalĕ sahajayogigini