Vinugali maadalagu vibhuni nela dooreve

వినుకలి మాటలకు విభుని నేల దూరేవే
Language

(॥పల్లవి॥)
వినుకలి మాటలకు విభుని నేల దూరేవే
యెనసి యాతనితోడ నిచ్చకమే యాడవే

(॥విను॥)
జాము వోయి వచ్చెనంటా చప్పనాయ మోవియంటా
యేమిటి కాతని నేరాలెంచేవే నీవు
నీ మొగమే చూచీని నీతోనే మాటలాడీని
ప్రేమపు సతిని వొడిఁ బెట్టుకొని వచ్చెనా

(॥విను॥)
వుద్దండీఁడై వున్నాఁడంటా వొగరాయ వలపంటా
గద్దించి పతినేల కాఁతాళించేవే
వద్దనే తానున్న వాఁడు వడి నీతో నవ్వు నవ్వీ
కొద్దిలేని సతులను కుచ్చి కట్టుకొనెనా

(॥విను॥)
తచ్చనలు సేసీనంటా తరితీపాయఁ బొందంటా
హెచ్చి శ్రీవేంకటేశ్వరు నెంత లోఁచేవే
అచ్చపుటల మేల్మంగ వతఁడు నిన్నుఁ గూడె
బచ్చెన సతుల వేరే బండిఁ బెట్టుకున్నాఁడా

(||pallavi||)
vinugali māḍalagu vibhuni nela dūreve
yĕnasi yādanidoḍa nichchagame yāḍave

(||vinu||)
jāmu voyi vachchĕnaṁṭā sappanāya moviyaṁṭā
yemiḍi kādani nerālĕṁcheve nīvu
nī mŏgame sūsīni nīdone māḍalāḍīni
premabu sadini vŏḍim̐ bĕṭṭugŏni vachchĕnā

(||vinu||)
vuddaṁḍīm̐ḍai vunnām̐ḍaṁṭā vŏgarāya valabaṁṭā
gaddiṁchi padinela kām̐tāḽiṁcheve
vaddane tānunna vām̐ḍu vaḍi nīdo navvu navvī
kŏddileni sadulanu kuchchi kaṭṭugŏnĕnā

(||vinu||)
tachchanalu sesīnaṁṭā taridībāyam̐ bŏṁdaṁṭā
hĕchchi śhrīveṁkaḍeśhvaru nĕṁta lom̐seve
achchabuḍala melmaṁga vadam̐ḍu ninnum̐ gūḍĕ
bachchĕna sadula vere baṁḍim̐ bĕṭṭugunnām̐ḍā