Vinodimchavayyaa imdu veduga sesee neegu

వినోదించవయ్యా ఇందు వేడుక సేసీ నీకు
Language

(॥పల్లవి॥)
వినోదించవయ్యా ఇందు వేడుక సేసీ నీకు
ఘనసింగార వనము కామిని వెంచెనయ్యా

(॥॥)
తెగరానియాసలు తీగెలువారఁ గాను
జిగిమించి చింతలు చిగిరించఁ గా
నిగిడి నివ్వెరగులు నీడలు గప్పఁగాను
తగుసింగారవనము తరుణి వెంచెనయ్యా

(॥॥)
చిత్తమే జొంపాలుగట్టి చీఁకట్లుగొనఁ గాను
హత్తి కోరికవిరులు గుత్తులై మించెఁ
బొత్తుగాఁ బెంజెమటల పూవుఁ దేనెల గురియ
కొత్తసింగారవనము కోమలి వెంచెనయ్యా

(॥॥)
నెయ్యముతోఁ జన్నుల నిమ్మపండ్లు వండఁ గాను
పయ్యదవెలుఁగు చుట్టిబయలు గాఁగా
ఇయ్యెడ శ్రీవేంకటేశ యీకె నేలితివి
వొయ్యనె సింగారవన మువిద వెంచెనయ్యా

(||pallavi||)
vinodiṁchavayyā iṁdu veḍuga sesī nīgu
ghanasiṁgāra vanamu kāmini vĕṁchĕnayyā

(||||)
tĕgarāniyāsalu tīgĕluvāram̐ gānu
jigimiṁchi siṁtalu sigiriṁcham̐ gā
nigiḍi nivvĕragulu nīḍalu gappam̐gānu
tagusiṁgāravanamu taruṇi vĕṁchĕnayyā

(||||)
sittame jŏṁpālugaṭṭi sīm̐kaṭlugŏnam̐ gānu
hatti korigavirulu guttulai miṁchĕm̐
bŏttugām̐ bĕṁjĕmaḍala pūvum̐ denĕla guriya
kŏttasiṁgāravanamu komali vĕṁchĕnayyā

(||||)
nĕyyamudom̐ jannula nimmabaṁḍlu vaṁḍam̐ gānu
payyadavĕlum̐gu suṭṭibayalu gām̐gā
iyyĕḍa śhrīveṁkaḍeśha yīgĕ nelidivi
vŏyyanĕ siṁgāravana muvida vĕṁchĕnayyā