వినోదకాఁడైనాఁడు విట్ఠలేశుఁడు
(॥పల్లవి॥)
వినోదకాఁడైనాఁడు విట్ఠలేశుఁడు
అనాదిదేవుఁడనే యాతఁ డీతఁడా
(॥॥)
మాయరోలఁ గట్టువడి మద్దులు విరిచివేసి
ఆయతమైయున్న యట్టియాతఁ డీతఁడా
పేయలఁ గాచినాఁడు పెరుగువంటకములు
ఆయెడ నారగించినయాతఁ డీతఁడా
(॥॥)
తల్లిబిడ్డ లైన గొల్ల తరుణులనెల్లాఁ గూడి
అల్లుకొనఁజేసె వావు లాతఁ డీతఁడా
తొల్లి గోవర్దనమెత్తి దొరతనాలెల్లాఁజేసి
అల్లవాఁడె నిలుచున్నాఁడాతఁ డీతఁడా
(॥॥)
చందముగ రుకుమిణి సత్యభామాదిసతుల-
నందంద పెండ్లాడిన ఆతఁ డీతఁడా
ఇందిరయుఁ దానుఁ గూడి ఇదె శ్రీవేంకటాద్రిపై-
నందరికి వరాలిచ్చీ నాతఁడీతఁడా
(||pallavi||)
vinodagām̐ḍainām̐ḍu viṭṭhaleśhum̐ḍu
anādidevum̐ḍane yādam̐ ḍīdam̐ḍā
(||||)
māyarolam̐ gaṭṭuvaḍi maddulu virisivesi
āyadamaiyunna yaṭṭiyādam̐ ḍīdam̐ḍā
peyalam̐ gāsinām̐ḍu pĕruguvaṁṭagamulu
āyĕḍa nāragiṁchinayādam̐ ḍīdam̐ḍā
(||||)
tallibiḍḍa laina gŏlla taruṇulanĕllām̐ gūḍi
allugŏnam̐jesĕ vāvu lādam̐ ḍīdam̐ḍā
tŏlli govardanamĕtti dŏradanālĕllām̐jesi
allavām̐ḍĕ nilusunnām̐ḍādam̐ ḍīdam̐ḍā
(||||)
saṁdamuga rugumiṇi satyabhāmādisadula-
naṁdaṁda pĕṁḍlāḍina ādam̐ ḍīdam̐ḍā
iṁdirayum̐ dānum̐ gūḍi idĕ śhrīveṁkaḍādribai-
naṁdarigi varālichchī nādam̐ḍīdam̐ḍā