వినోదాన కోపవట విరహాన కోపేవా
(॥పల్లవి॥)
వినోదాన కోపవట విరహాన కోపేవా
యెనసి నీ వితని యిచ్చలో మెలఁగవే
(॥వినో॥)
కొనగోరి తాకులకు కొచ్చి వొడ్డించుకొనేవు
యెనలేని మరునమ్ము లెట్టేరిచేవే
పెనఁగాతఁడు నవ్వితే బెట్టుగా నెగ్గుపట్టేవు
వెనక వచ్చే వెన్నెల వేఁడిగాదా చెలియా
(॥వినో॥)
పచ్చి మాఁట లాడితేను పతిమీఁద సొలసేవు
హెచ్చి చిలుకపలుకు లేఁపనా నిన్ను
ముచ్చట గురు లంటితే మునుకొని జంకించేవు
వచ్చి యలులు మూఁగితే వారించఁగలవా
(॥వినో॥)
కదిసి మోము చూపి వే కడు సిగ్గులు వడేవు
యెదురైన చందమామ యెంత సేసునో
వదలక శ్రీవేంకటేశ్వరుఁ డిట్టె నిన్నుఁ గూడె
పదరేవు వలపింక పైపైఁ బెరుగుఁగదే
(||pallavi||)
vinodāna kobavaḍa virahāna kobevā
yĕnasi nī vidani yichchalo mĕlam̐gave
(||vino||)
kŏnagori tāgulagu kŏchchi vŏḍḍiṁchugŏnevu
yĕnaleni marunammu lĕṭṭeriseve
pĕnam̐gādam̐ḍu navvide bĕṭṭugā nĕggubaṭṭevu
vĕnaga vachche vĕnnĕla vem̐ḍigādā sĕliyā
(||vino||)
pachchi mām̐ṭa lāḍidenu padimīm̐da sŏlasevu
hĕchchi silugabalugu lem̐panā ninnu
muchchaḍa guru laṁṭide munugŏni jaṁkiṁchevu
vachchi yalulu mūm̐gide vāriṁcham̐galavā
(||vino||)
kadisi momu sūbi ve kaḍu siggulu vaḍevu
yĕduraina saṁdamāma yĕṁta sesuno
vadalaga śhrīveṁkaḍeśhvarum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
padarevu valabiṁka paibaim̐ bĕrugum̐gade