Vinnavimchumane mammu velamdi neegu neevu

విన్నవించుమనె మమ్ము వెలఁది నీకు నీవు
Language

(॥పల్లవి॥)
విన్నవించుమనె మమ్ము వెలఁది నీకు నీవు
వన్నెలు చూపినఁగాని వలపులేర్పడవు

(॥విన్న॥)
మాటలాడి తనియదు మగువ నీతో నేఁడు
తాటించి పువ్వులవేసి తనియదు
గాటపుగుబ్బలు నిండఁ గాఁగిలించుకొన్నఁ గాని
వాఁటమైన మీలోని వలపులేర్పడవు

(॥విన్న॥)
చిఱునవ్వులు నవ్వియు చిత్తములోఁ దనియదు
తఱితో మొక్కులు మొక్కి తనియదు
పిఱుదంటి తొడలపైఁ బెట్టుకవుండినఁగాని
మఱియును మెరసి నీమచ్చికలేర్పడవు

(॥విన్న॥)
సొలసి సొలసి నిన్నుఁజూచి చూచి తనియదు
తలఁగక సేవసేసీ తనియదు
అలమేల్మంగఁ గూడితివట్టే లాలించినఁగాని
చెలఁగి శ్రీవేంకటేశ వలపులేర్పడవు

(||pallavi||)
vinnaviṁchumanĕ mammu vĕlam̐di nīgu nīvu
vannĕlu sūbinam̐gāni valabulerbaḍavu

(||vinna||)
māḍalāḍi taniyadu maguva nīdo nem̐ḍu
tāḍiṁchi puvvulavesi taniyadu
gāḍabugubbalu niṁḍam̐ gām̐giliṁchugŏnnam̐ gāni
vām̐ṭamaina mīloni valabulerbaḍavu

(||vinna||)
siṟunavvulu navviyu sittamulom̐ daniyadu
taṟido mŏkkulu mŏkki taniyadu
piṟudaṁṭi tŏḍalabaim̐ bĕṭṭugavuṁḍinam̐gāni
maṟiyunu mĕrasi nīmachchigalerbaḍavu

(||vinna||)
sŏlasi sŏlasi ninnum̐jūsi sūsi taniyadu
talam̐gaga sevasesī taniyadu
alamelmaṁgam̐ gūḍidivaṭṭe lāliṁchinam̐gāni
sĕlam̐gi śhrīveṁkaḍeśha valabulerbaḍavu