విన్నవించితిమి నీకు వెలఁది భావములెల్లా
(॥పల్లవి॥)
విన్నవించితిమి నీకు వెలఁది భావములెల్లా
మన్నించుటే ఇఁక మంచి జాణతనము
(॥విన్న॥)
మరిగి పాయఁగలేక మగువ చెనకఁగాను
సరసము లాడేది జాణతనము
విరుల వేసి సన్నల వేమారుఁ బిలువఁగాను
మరుకేలిఁ బెనఁగేదే మరి జాణతనము
(॥విన్న॥)
ననుపులు పచరించి నవ్వులు నవ్వఁగాను
చనవిచ్చి పైకొనేది జాణతనము
తనివోక సారె మోము తప్పక చూడఁగాను
మనసు చొక్కించేదే మరి జాణతనము
(॥విన్న॥)
చెంతఁ గూడి చెప్పరాని సేవలెల్లాఁ జేయఁగాను
సంతోసించుకొనియెడి(యేది?) జాణతనము
ఇంతలో శ్రీవేంకటేశ నీకె నిన్ను వేఁడఁగాను
మంతనానఁ గలసేదే మరి జాణతనము
(||pallavi||)
vinnaviṁchidimi nīgu vĕlam̐di bhāvamulĕllā
manniṁchuḍe im̐ka maṁchi jāṇadanamu
(||vinna||)
marigi pāyam̐galega maguva sĕnagam̐gānu
sarasamu lāḍedi jāṇadanamu
virula vesi sannala vemārum̐ biluvam̐gānu
marugelim̐ bĕnam̐gede mari jāṇadanamu
(||vinna||)
nanubulu pasariṁchi navvulu navvam̐gānu
sanavichchi paigŏnedi jāṇadanamu
tanivoga sārĕ momu tappaga sūḍam̐gānu
manasu sŏkkiṁchede mari jāṇadanamu
(||vinna||)
sĕṁtam̐ gūḍi sĕpparāni sevalĕllām̐ jeyam̐gānu
saṁtosiṁchugŏniyĕḍi(yedi?) jāṇadanamu
iṁtalo śhrīveṁkaḍeśha nīgĕ ninnu vem̐ḍam̐gānu
maṁtanānam̐ galasede mari jāṇadanamu