Vinnavimchidimi neegu velamdi bhaavamulellaa

విన్నవించితిమి నీకు వెలఁది భావములెల్లా
Language

(॥పల్లవి॥)
విన్నవించితిమి నీకు వెలఁది భావములెల్లా
మన్నించు నింతట నీకె మరిగె నీరీతిని

(॥విన్న॥)
అతివ ముంగిలెల్లాను అడుగిడుగాఁ దొక్కె
తతి నీ కదురువచ్చే తమకానను
కతలుగా మోమెల్లాఁ గన్నులు చేసుక చూచె
రతి నీ వింటికివచ్చే రాకలకును

(॥విన్న॥)
జలజాక్షి వురమెల్లాఁ జన్నులుగానే పెంచె
చెలఁగి నిన్నుఁ గాఁగిలించే యాసల
పొలమెల్లానుఁ జిలుకపలుకులే వెదవెట్టె
నెలవుకు నిన్నుఁ బిలిచే నేరుపులను

(॥విన్న॥)
కొమ్మ దననిలువెల్లాఁ గొప్పుగానే నిక్కిచ్చె
నెమ్మి సేసవెట్టించుకొనే వేడుకలు
యిమ్ముల శ్రీవేంకటేశ యంతలో వచ్చి కూడితి
వెమ్మెల నీకె వెలసె నిందుకే యిన్నిటాను

(||pallavi||)
vinnaviṁchidimi nīgu vĕlam̐di bhāvamulĕllā
manniṁchu niṁtaḍa nīgĕ marigĕ nīrīdini

(||vinna||)
adiva muṁgilĕllānu aḍugiḍugām̐ dŏkkĕ
tadi nī kaduruvachche tamagānanu
kadalugā momĕllām̐ gannulu sesuga sūsĕ
radi nī viṁṭigivachche rāgalagunu

(||vinna||)
jalajākṣhi vuramĕllām̐ jannulugāne pĕṁchĕ
sĕlam̐gi ninnum̐ gām̐giliṁche yāsala
pŏlamĕllānum̐ jilugabalugule vĕdavĕṭṭĕ
nĕlavugu ninnum̐ bilise nerubulanu

(||vinna||)
kŏmma dananiluvĕllām̐ gŏppugāne nikkichchĕ
nĕmmi sesavĕṭṭiṁchugŏne veḍugalu
yimmula śhrīveṁkaḍeśha yaṁtalo vachchi kūḍidi
vĕmmĕla nīgĕ vĕlasĕ niṁduge yinniḍānu