విన్నవించితిమి నీకు వేడుకైన దీమాట
(॥పల్లవి॥)
విన్నవించితిమి నీకు వేడుకైన దీమాట
పన్నినట్టి మేళ్లెల్లా పైపైనే వున్నవి
(॥విన్న॥)
నిందునిధానములుగా నెలఁతచన్నులు నీకు
దండిగాఁ బయ్యదలో దాఁచుకున్నది
పండుమోవితే నెలపంచామృతాలతోడ
గండుమీరి విందుచెప్పఁ గాచుకున్నది
(॥విన్న॥)
కందువచిరునవ్వులకప్పురవిడేలు నీకు
అంది సూడిదెవట్టుక అట్టె వున్నది
సందడి కనుచూపుల చకోరవుఁబక్షులను
యిందు కెదురుగా నంపి ఇంపుతోడ నున్నది
(॥విన్న॥)
పక్కన తనజవ్వనబండార మంతయును
అక్కజాన నీ కిచ్చేనని వున్నది
తక్కక శ్రీవేంకటేశ తానే నిన్నుఁ బిలుచుక
వెక్కసాన నిన్నుఁ గూడి విఱ్ఱవీఁగి వున్నది
(||pallavi||)
vinnaviṁchidimi nīgu veḍugaina dīmāḍa
panninaṭṭi meḽlĕllā paibaine vunnavi
(||vinna||)
niṁdunidhānamulugā nĕlam̐tasannulu nīgu
daṁḍigām̐ bayyadalo dām̐sugunnadi
paṁḍumovide nĕlabaṁchāmṛtāladoḍa
gaṁḍumīri viṁdusĕppam̐ gāsugunnadi
(||vinna||)
kaṁduvasirunavvulagappuraviḍelu nīgu
aṁdi sūḍidĕvaṭṭuga aṭṭĕ vunnadi
saṁdaḍi kanusūbula sagoravum̐bakṣhulanu
yiṁdu kĕdurugā naṁpi iṁpudoḍa nunnadi
(||vinna||)
pakkana tanajavvanabaṁḍāra maṁtayunu
akkajāna nī kichchenani vunnadi
takkaga śhrīveṁkaḍeśha tāne ninnum̐ bilusuga
vĕkkasāna ninnum̐ gūḍi viṭravīm̐gi vunnadi