Vinnavimchidimi mumde venaga neṟamgaraadu

విన్నవించితిమి ముందే వెనక నెఱఁగరాదు
Language

(॥పల్లవి॥)
విన్నవించితిమి ముందే వెనక నెఱఁగరాదు
పన్ని మాటదప్పితేనే పచ్చిదేరు సుమ్మీ

(॥విన్న॥)
మదనుఁడెక్కెడితేజిమాటలాడే దీచెలియ
వదనము చంద్రునివంటిది
యెదుటఁగోవిలకూఁత దీకెతో నీ వెన్నఁడైనా
పదరి నీ వలిగితేఁ బై వచ్చుఁజుమ్మీ

(॥విన్న॥)
కారుమెఱుఁగులవంటికన్నులమించుల దీకె
తోరపు మేఘమువంటితురుమది
నారసపువిరులలేనవ్వుల దీపెతోడ
చేరి మారుకొంటేను చిమ్మిరేఁచుఁ జుమ్మీ

(॥విన్న॥)
కెలనఁ జుట్టు కొనే తీగెలవంటిచేతులది
వులుకుగాలివంటివూరుపులది
బలిమి శ్రీవేంకటేశ పాలించితి వింతిఁ గూడి
తులదూఁగకున్న రతి దూరుసేసుఁ జుమ్మీ

(||pallavi||)
vinnaviṁchidimi muṁde vĕnaga nĕṟam̐garādu
panni māḍadappidene pachchideru summī

(||vinna||)
madanum̐ḍĕkkĕḍidejimāḍalāḍe dīsĕliya
vadanamu saṁdrunivaṁṭidi
yĕduḍam̐govilagūm̐ta dīgĕdo nī vĕnnam̐ḍainā
padari nī valigidem̐ bai vachchum̐jummī

(||vinna||)
kārumĕṟum̐gulavaṁṭigannulamiṁchula dīgĕ
torabu meghamuvaṁṭidurumadi
nārasabuvirulalenavvula dībĕdoḍa
seri mārugŏṁṭenu simmirem̐sum̐ jummī

(||vinna||)
kĕlanam̐ juṭṭu kŏne tīgĕlavaṁṭiseduladi
vulugugālivaṁṭivūrubuladi
balimi śhrīveṁkaḍeśha pāliṁchidi viṁtim̐ gūḍi
tuladūm̐gagunna radi dūrusesum̐ jummī