విన్నవించితి నా విధమెల్లా నీకు నేఁడు
(॥పల్లవి॥)
విన్నవించితి నా విధమెల్లా నీకు నేఁడు
మన్నింతువు నా గుణము మఱవకు మిఁకను
(॥విన్న॥)
జిగురువంటిది నాచిత్తముగాఁబోలును
అగవడి నీయందే యంటుకున్నది
తగులువంటిది నాతనువుగాఁ బోలును
వెగటులేక కాఁగిలి విడువ దెఁతైనా
(॥విన్న॥)
కొడితీఁగెవంటిది నాకోరికగాఁబోలును
అడరి నీపొందుల నల్లుకొనీని
వడిఁ జుట్టమువంటిది వలపు నాది గాఁబోలు
యెడసి పాయఁగలేదు ఇంచుకంతా నిన్నును
(॥విన్న॥)
సరి వనమువంటిది సంతోసముగాఁ బోలును
నిరతి నామోవిపండు నీకిచ్చెను
ఇరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
సిరుల నన్నేలితివి చెప్పఁ గొత్తలాయను
(||pallavi||)
vinnaviṁchidi nā vidhamĕllā nīgu nem̐ḍu
manniṁtuvu nā guṇamu maṟavagu mim̐kanu
(||vinna||)
jiguruvaṁṭidi nāsittamugām̐bolunu
agavaḍi nīyaṁde yaṁṭugunnadi
taguluvaṁṭidi nādanuvugām̐ bolunu
vĕgaḍulega kām̐gili viḍuva dĕm̐tainā
(||vinna||)
kŏḍidīm̐gĕvaṁṭidi nāgorigagām̐bolunu
aḍari nībŏṁdula nallugŏnīni
vaḍim̐ juṭṭamuvaṁṭidi valabu nādi gām̐bolu
yĕḍasi pāyam̐galedu iṁchugaṁtā ninnunu
(||vinna||)
sari vanamuvaṁṭidi saṁtosamugām̐ bolunu
niradi nāmovibaṁḍu nīgichchĕnu
iravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
sirula nannelidivi sĕppam̐ gŏttalāyanu