Vinnavimchi rammanenu velamdi needo mammu

విన్నవించి రమ్మనెను వెలఁది నీతో మమ్ము
Language

(॥పల్లవి॥)
విన్నవించి రమ్మనెను వెలఁది నీతో మమ్ము
వున్న దదే సిగ్గుతో నీ వొద్దనే సుమ్మీ

(॥॥)
చుక్కబొట్టు వెట్టుకొని సుదతి నీ పాదాలకు
మొక్కి యంటించెను తన ముద్రగాను
నిక్కముగఁ జూచుకో నీవు దనవాఁడవని
యిక్కువ గానుఁ బెట్టిన ఇదె గుఱి సుమ్మీ

(॥॥)
కొప్పు విరులు రాలఁగ కొమ్మ నీ తోడఁ బెనఁగి
చొప్పు వేసె నీవు దన సొమ్ముగాను
ముప్పిరి నెంచుకో నిన్ను ముందే తాఁ గైకొంటినని
చెప్పి చూపి పెట్టిన లచ్చెనలు సుమ్మీ

(॥॥)
అలమేలుమంగ నీ యక్కుమీఁద నేపొద్దు
నెలకొనీఁ దన కదే నెలవు గాను
యెలమి శ్రీ వేంకటేశ యీకె నీ మేనికి
సలిగెతో వలపుల శాసనము సుమ్మీ

(||pallavi||)
vinnaviṁchi rammanĕnu vĕlam̐di nīdo mammu
vunna dade siggudo nī vŏddane summī

(||||)
sukkabŏṭṭu vĕṭṭugŏni sudadi nī pādālagu
mŏkki yaṁṭiṁchĕnu tana mudragānu
nikkamugam̐ jūsugo nīvu danavām̐ḍavani
yikkuva gānum̐ bĕṭṭina idĕ guṟi summī

(||||)
kŏppu virulu rālam̐ga kŏmma nī toḍam̐ bĕnam̐gi
sŏppu vesĕ nīvu dana sŏmmugānu
muppiri nĕṁchugo ninnu muṁde tām̐ gaigŏṁṭinani
sĕppi sūbi pĕṭṭina lachchĕnalu summī

(||||)
alamelumaṁga nī yakkumīm̐da nebŏddu
nĕlagŏnīm̐ dana kade nĕlavu gānu
yĕlami śhrī veṁkaḍeśha yīgĕ nī menigi
saligĕdo valabula śhāsanamu summī