Vinnavimchemani vachchi veragamdi vunnaaramu

విన్నవించేమని వచ్చి వెరగంది వున్నారము
Language

(॥పల్లవి॥)
విన్నవించేమని వచ్చి వెరగంది వున్నారము
యిన్నిటాను తెమలవు యేమనేమయ్యా

(॥విన్న॥)
సరసమాడఁగానే సరివొద్దువోయెను
తెరదీసేననఁగానే తెల్లవారెను
పరగనింతివలపు పండి కై వాలెను
యెరవు సేయవు నిన్ను నేమనేమయ్యా

(॥విన్న॥)
మనసు చూడఁగానే మాపటిపొద్దాయెను
చనవిచ్చే ననఁగానే జామెక్కెను
వనజాక్షియాసలు వడఁబడి ముదిరెను
యెనయవద్దా నిన్ను నేమనేమయ్యా

(॥విన్న॥)
పంతములాడఁగానే పడుమటజామాయ
మంతనమాడేకొద్దికి మద్దేనమాయ
చెంతల శ్రీ వేంకటేశ చెలికి బాగ్యముచేరె
యింతగా మన్నించితివి యేమనేమయ్యా

(||pallavi||)
vinnaviṁchemani vachchi vĕragaṁdi vunnāramu
yinniḍānu tĕmalavu yemanemayyā

(||vinna||)
sarasamāḍam̐gāne sarivŏdduvoyĕnu
tĕradīsenanam̐gāne tĕllavārĕnu
paraganiṁtivalabu paṁḍi kai vālĕnu
yĕravu seyavu ninnu nemanemayyā

(||vinna||)
manasu sūḍam̐gāne mābaḍibŏddāyĕnu
sanavichche nanam̐gāne jāmĕkkĕnu
vanajākṣhiyāsalu vaḍam̐baḍi mudirĕnu
yĕnayavaddā ninnu nemanemayyā

(||vinna||)
paṁtamulāḍam̐gāne paḍumaḍajāmāya
maṁtanamāḍegŏddigi maddenamāya
sĕṁtala śhrī veṁkaḍeśha sĕligi bāgyamuserĕ
yiṁtagā manniṁchidivi yemanemayyā