Vinnavimche middarigi vinavayya selulamu

విన్నవించే మిద్దరికి వినవయ్య చెలులము
Language

(॥పల్లవి॥)
విన్నవించే మిద్దరికి వినవయ్య చెలులము
నిన్ననే కంటిమి మీ నిండుమోహము

(॥విన్నవించే॥)
సారెకు నెంతేసి యాసల నెంచినాను
నేరము లెంచనిదే నిండుమోహము
గారవించి యేపాటి కౌఁగిలించినను
నీరువలెఁ గరఁగేదే నిండుమోహము

(॥విన్నవించే॥)
పిలిచితేఁ బలుకక బిగిసి వూరకుండితే
నిలిచి వేఁడుకొన్నదే నిండుమోహము
చలము సాదించినను చవిసేసుకో మనసు
నిలుకడఁ బొగడేదే నిండు మోహము

(॥విన్నవించే॥)
తక్కక పరాకైతే తరితీపుతోడుత
నిక్కి నిక్కి చూచినదే నిండుమోహము
ఇక్కడ శ్రీవేంకటేశ యిద్దరునుఁ గూడితిరి
నెక్కొనె మీయందే నిండుమోహము

(||pallavi||)
vinnaviṁche middarigi vinavayya sĕlulamu
ninnane kaṁṭimi mī niṁḍumohamu

(||vinnaviṁche||)
sārĕgu nĕṁtesi yāsala nĕṁchinānu
neramu lĕṁchanide niṁḍumohamu
gāraviṁchi yebāḍi kaum̐giliṁchinanu
nīruvalĕm̐ garam̐gede niṁḍumohamu

(||vinnaviṁche||)
pilisidem̐ balugaga bigisi vūraguṁḍide
nilisi vem̐ḍugŏnnade niṁḍumohamu
salamu sādiṁchinanu savisesugo manasu
nilugaḍam̐ bŏgaḍede niṁḍu mohamu

(||vinnaviṁche||)
takkaga parāgaide taridībudoḍuda
nikki nikki sūsinade niṁḍumohamu
ikkaḍa śhrīveṁkaḍeśha yiddarunum̐ gūḍidiri
nĕkkŏnĕ mīyaṁde niṁḍumohamu