విన్నవించవే యీమాఁట విభునికిని
(॥పల్లవి॥)
విన్నవించవే యీమాఁట విభునికిని
కన్నులారాఁ దానే వచ్చి కనుఁగొనుమనవే
(॥॥)
తన్నుఁ దలంచు కొంటేను తలపొఁతలు
విన్నవినుకలి రేఁచీ వేడుకలు
చన్నులపైఁ జేసినాడు చంద్రవంకలు
యెన్నగానినామోహ మేమని చెప్పుదునే
(॥॥)
దిట్టనై నే నొంటినుండితే విరహము
ఆట్టె తొంగి చూచితేను ఆడియాసలు
కట్టినాఁడు ముంజేతఁ గంకణము
యెట్టు వేగించఁగవచ్చు నేమి నేతునే
(॥॥)
నేనే మాటాడేనంటే నిండీ నిగ్గు
మోనమున నుండి తేను మంచీఁ రమి
తానే శ్రీవేంకటేశుఁడు తగ నన్నేలె
యీనెపాలెల్లా నాకు నేమిటికి వచ్చునే
(||pallavi||)
vinnaviṁchave yīmām̐ṭa vibhunigini
kannulārām̐ dāne vachchi kanum̐gŏnumanave
(||||)
tannum̐ dalaṁchu kŏṁṭenu talabŏm̐talu
vinnavinugali rem̐sī veḍugalu
sannulabaim̐ jesināḍu saṁdravaṁkalu
yĕnnagānināmoha memani sĕppudune
(||||)
diṭṭanai ne nŏṁṭinuṁḍide virahamu
āṭṭĕ tŏṁgi sūsidenu āḍiyāsalu
kaṭṭinām̐ḍu muṁjedam̐ gaṁkaṇamu
yĕṭṭu vegiṁcham̐gavachchu nemi nedune
(||||)
nene māḍāḍenaṁṭe niṁḍī niggu
monamuna nuṁḍi tenu maṁchīm̐ rami
tāne śhrīveṁkaḍeśhum̐ḍu taga nannelĕ
yīnĕbālĕllā nāgu nemiḍigi vachchune