విన్నవించవలెనా వీరూ వారు నిందులకు
(॥పల్లవి॥)
విన్నవించవలెనా వీరూ వారు నిందులకు
పన్నిన మీ కంకణాలే పదిలాలు గాక
(॥విన్న॥)
వాసులెంచనేఁటికి వలసినచోటికి
యిసునఁగోపించినాను ఇంపులేకాక
వేసరఁగఁ బనిలేదు వేయైనా మీకె పోదు
సేసతోఁ బెండ్లాడినట్టిచెలియకుఁ బతికి
(॥విన్న॥)
కోపగించనొద్దు నొద్దు కొనకెక్కె నదె పొద్దు
చేపట్టినప్పుడే మీకుఁ జెల్లెఁగాక
మోపులాయఁ బులకలు ముంచినసిగ్గులు వోయ
యేపున నేర్పరులు మీ కింతగద్దా చలము
(॥విన్న॥)
కూడితిరి చాలను గుణములు మేలును
యీడుజోడు లెంచనేల ఇంతటిమీఁద
వేడుకలు తదకెక్కె వింతకళలెల్లా నిక్కె
యీడనే శ్రీవేంకటేశ ఇందిరకు నీకును
(||pallavi||)
vinnaviṁchavalĕnā vīrū vāru niṁdulagu
pannina mī kaṁkaṇāle padilālu gāga
(||vinna||)
vāsulĕṁchanem̐ṭigi valasinasoḍigi
yisunam̐gobiṁchinānu iṁpulegāga
vesaram̐gam̐ baniledu veyainā mīgĕ podu
sesadom̐ bĕṁḍlāḍinaṭṭisĕliyagum̐ badigi
(||vinna||)
kobagiṁchanŏddu nŏddu kŏnagĕkkĕ nadĕ pŏddu
sebaṭṭinappuḍe mīgum̐ jĕllĕm̐gāga
mobulāyam̐ bulagalu muṁchinasiggulu voya
yebuna nerbarulu mī kiṁtagaddā salamu
(||vinna||)
kūḍidiri sālanu guṇamulu melunu
yīḍujoḍu lĕṁchanela iṁtaḍimīm̐da
veḍugalu tadagĕkkĕ viṁtagaḽalĕllā nikkĕ
yīḍane śhrīveṁkaḍeśha iṁdiragu nīgunu