విన్నవించవలె నీకు వేడుకఁ దొలుదొలుతే
(॥పల్లవి॥)
విన్నవించవలె నీకు వేడుకఁ దొలుదొలుతే
యెన్నిక సేసెఁ జుమ్మీ యెగ్గుపట్టవలదు
(॥విన్న॥)
నీవు మాటలాడినట్టె నేనూ మాటలాడితేను
తావిబెల్లములోఁ బంచరాచ చల్లుట
వోవరిలో నే నిందుకువుప్పనిచ్చనితిట్లు
యీవలనే నాడేఁజుమ్మీ యెగ్గుపట్టవలదు
(॥విన్న॥)
మొక్కిన నీ మొక్కులకు ముంచి నేనూ మొక్కితేను
మక్కళించి అల్లులుఁ దామర లల్లుట
చిక్కుదీరఁ గొనగొళ్ల చిమ్మిరేఁచి కొంత గొంత
ఇక్కువ లంటేఁజుమ్మీ యెగ్గుపట్టవలదు
(॥విన్న॥)
సిగ్గులమీఁద సిగ్గులు చేరి నేనూ నెరపితే
వొగ్గి ముత్యాలును వజ్రాలు నర్చించుట
అగ్గమై శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
తగ్గక గర్వించేఁజుమ్మీ యెగ్గుపట్టవలదు
(||pallavi||)
vinnaviṁchavalĕ nīgu veḍugam̐ dŏludŏlude
yĕnniga sesĕm̐ jummī yĕggubaṭṭavaladu
(||vinna||)
nīvu māḍalāḍinaṭṭĕ nenū māḍalāḍidenu
tāvibĕllamulom̐ baṁcharāsa salluḍa
vovarilo ne niṁduguvuppanichchanidiṭlu
yīvalane nāḍem̐jummī yĕggubaṭṭavaladu
(||vinna||)
mŏkkina nī mŏkkulagu muṁchi nenū mŏkkidenu
makkaḽiṁchi allulum̐ dāmara lalluḍa
sikkudīram̐ gŏnagŏḽla simmirem̐si kŏṁta gŏṁta
ikkuva laṁṭem̐jummī yĕggubaṭṭavaladu
(||vinna||)
siggulamīm̐da siggulu seri nenū nĕrabide
vŏggi mutyālunu vajrālu narsiṁchuḍa
aggamai śhrīveṁkaḍeśha anniḍā nannelidivi
taggaga garviṁchem̐jummī yĕggubaṭṭavaladu