విన్నవించరే యీమాఁట విభుడు తానే యెఱుఁగు
(॥పల్లవి॥)
విన్నవించరే యీమాఁట విభుడు తానే యెఱుఁగు
మన్నన గల పగటు మచ్చిక లౌనే
(॥విన్న॥)
కలిమితోడిపొందులుకప్పురపునోటిమాఁట
సలిగెతోడికొలువు చక్కనుండెనే
పిలుపుతోడిరాక ప్రియముతోడివిందు
చలి వేఁడి కూరలు చవివుట్టునే
(॥విన్న॥)
సురతములోనితిట్టు చూపునాఁటించినగుట్టు
తరితీపుసన్నలు తమిరేఁచునే
అరుదుగానవ్విన నవ్వు లడియాసచెనకులు
సరసపువేడుకలు జట్టితో నలరునే
(॥విన్న॥)
పాయముతోడిపంతాలు వచ్చి వెచ్చిసిగ్గులు
నాయముతోడితగవు నమ్మిక లౌనే
యీమెడ శ్రీవేంకటేశుఁడిదె తానె నన్నుఁ గూడ
చేయిమీఁదైనపందేలు చేతికి లోనౌనే
(||pallavi||)
vinnaviṁchare yīmām̐ṭa vibhuḍu tāne yĕṟum̐gu
mannana gala pagaḍu machchiga laune
(||vinna||)
kalimidoḍibŏṁdulugappurabunoḍimām̐ṭa
saligĕdoḍigŏluvu sakkanuṁḍĕne
pilubudoḍirāga priyamudoḍiviṁdu
sali vem̐ḍi kūralu savivuṭṭune
(||vinna||)
suradamulonidiṭṭu sūbunām̐ṭiṁchinaguṭṭu
taridībusannalu tamirem̐sune
arudugānavvina navvu laḍiyāsasĕnagulu
sarasabuveḍugalu jaṭṭido nalarune
(||vinna||)
pāyamudoḍibaṁtālu vachchi vĕchchisiggulu
nāyamudoḍidagavu nammiga laune
yīmĕḍa śhrīveṁkaḍeśhum̐ḍidĕ tānĕ nannum̐ gūḍa
seyimīm̐dainabaṁdelu sedigi lonaune