Vinnavimchare yeemaamta veenulam batteem gaani

విన్నవించరే యీమాఁట వీనులఁ బట్టీఁ గాని
Language

(॥పల్లవి॥)
విన్నవించరే యీమాఁట వీనులఁ బట్టీఁ గాని
అన్నిటా వెన్నెలనాఁడే యల్లునేరేళ్ల

(॥విన్న॥)
తలపోసి తలపోసి తమకమే గనమాయ
యెలమి నారయణుఁడు యేమిసేసీనే
యిలపై నుప్పు చింది యినుమడాయ నందురు
వలపులు తనపైఁ జింది వడి ముమ్మడాయనే

(॥విన్న॥)
విని విని మనసులో వేడుకలే గనమాయ
ఘనుఁడైన తనకు నెక్కడి పరాకే
చెనకి వావి చెట్లచేటఁడాయ నందురు
కొనవాఁడినాగుబ్బలు కోటానఁగోట్లే

(॥విన్న॥)
యెదురులుచూచి చూచి యేఁకటలే గనమాయ
యిదివో తనరాక యింక నెప్పుడే
అడనుఁ బదనుఁ గూడె నందురు శ్రీవేంకటేశుఁ
గదిసినరతివెద కంతునియామనె

(||pallavi||)
vinnaviṁchare yīmām̐ṭa vīnulam̐ baṭṭīm̐ gāni
anniḍā vĕnnĕlanām̐ḍe yallunereḽla

(||vinna||)
talabosi talabosi tamagame ganamāya
yĕlami nārayaṇum̐ḍu yemisesīne
yilabai nuppu siṁdi yinumaḍāya naṁduru
valabulu tanabaim̐ jiṁdi vaḍi mummaḍāyane

(||vinna||)
vini vini manasulo veḍugale ganamāya
ghanum̐ḍaina tanagu nĕkkaḍi parāge
sĕnagi vāvi sĕṭlaseḍam̐ḍāya naṁduru
kŏnavām̐ḍināgubbalu koḍānam̐goṭle

(||vinna||)
yĕdurulusūsi sūsi yem̐kaḍale ganamāya
yidivo tanarāga yiṁka nĕppuḍe
aḍanum̐ badanum̐ gūḍĕ naṁduru śhrīveṁkaḍeśhum̐
gadisinaradivĕda kaṁtuniyāmanĕ