విన్నవించరే యీమాట విభునికిని
(॥పల్లవి॥)
విన్నవించరే యీమాట విభునికిని
తన్నుఁ దానె యెఱుఁగును తలఁచుకొమ్మనవే
(॥॥)
మనసు లేకములై తే మాటలు సమ్మతులౌను
ననుపు గలిగితేను నవ్వు గలుగు
తనువులు సోఁకితేనే తమకములు రేఁగును
చనవు సతమైతేనే సరసము చెల్లును
(॥॥)
పాడితో నడచితేనే సం లీడేరును
జోడుగూడి వుండితేనే సొంపైవుండును
వేడుక లొనగూడితే వీడుదోడు లితవౌను
వాడికలు దొరికితే వలపు లమరును
(॥॥)
యేకతములై తేనే ఇక్కువలు గరఁగును
కై కొని కాఁగిలించితే కళ లుబ్బును
యీకడ నలమేల్మంగ నేలె శ్రీ వేంకటేశుఁడు
చేకొని నన్నుఁ గూడెను చిత్తగించుమనవే
(||pallavi||)
vinnaviṁchare yīmāḍa vibhunigini
tannum̐ dānĕ yĕṟum̐gunu talam̐sugŏmmanave
(||||)
manasu legamulai te māḍalu sammadulaunu
nanubu galigidenu navvu galugu
tanuvulu som̐kidene tamagamulu rem̐gunu
sanavu sadamaidene sarasamu sĕllunu
(||||)
pāḍido naḍasidene saṁ līḍerunu
joḍugūḍi vuṁḍidene sŏṁpaivuṁḍunu
veḍuga lŏnagūḍide vīḍudoḍu lidavaunu
vāḍigalu dŏrigide valabu lamarunu
(||||)
yegadamulai tene ikkuvalu garam̐gunu
kai kŏni kām̐giliṁchide kaḽa lubbunu
yīgaḍa nalamelmaṁga nelĕ śhrī veṁkaḍeśhum̐ḍu
segŏni nannum̐ gūḍĕnu sittagiṁchumanave