Vinnavimchare yeemaada vibhunidonu

విన్నవించరే యీమాట విభునితోను
Language

(॥పల్లవి॥)
విన్నవించరే యీమాట విభునితోను
సన్నల చాయలఁ జూచే సతులే నవ్వరా

(॥విన్న॥)
కొంత గొంత మాటాడి కొమ్మ దలవంచుకొంటే
యెంత వేడుకొనీ నీతఁడిదె చూడరే
పంతగాఁడిన్నిటాఁ దాను పక్కనఁ గిందుపడీని
పంతుకు తనుఁగొలిచేవనితలే నవ్వరా

(॥విన్న॥)
భావించి చూచి పడఁతి పానుపుపైఁ బండితేను
యీవలఁ జేయెత్తి మొక్కీనిదె చూడరే
లావరి యిన్నిటాఁ దాను లలనకు లోఁగీని
సేవ సేయ వచ్చినట్టి చెలులే నవ్వరా

(॥విన్న॥)
తొయ్యలి చేత దొబ్బి దొమ తెర వేసుకొంటే
కొయ్య శ్రీవేంకటేశుఁడు కూడెఁ జూడరే
చయ్యన దేవుఁడు దాను సతులబారికిఁ జిక్కె
యియ్యడఁ గొలువు సేసేయింతులే నవ్వరా

(||pallavi||)
vinnaviṁchare yīmāḍa vibhunidonu
sannala sāyalam̐ jūse sadule navvarā

(||vinna||)
kŏṁta gŏṁta māḍāḍi kŏmma dalavaṁchugŏṁṭe
yĕṁta veḍugŏnī nīdam̐ḍidĕ sūḍare
paṁtagām̐ḍinniḍām̐ dānu pakkanam̐ giṁdubaḍīni
paṁtugu tanum̐gŏlisevanidale navvarā

(||vinna||)
bhāviṁchi sūsi paḍam̐ti pānububaim̐ baṁḍidenu
yīvalam̐ jeyĕtti mŏkkīnidĕ sūḍare
lāvari yinniḍām̐ dānu lalanagu lom̐gīni
seva seya vachchinaṭṭi sĕlule navvarā

(||vinna||)
tŏyyali seda dŏbbi dŏma tĕra vesugŏṁṭe
kŏyya śhrīveṁkaḍeśhum̐ḍu kūḍĕm̐ jūḍare
sayyana devum̐ḍu dānu sadulabārigim̐ jikkĕ
yiyyaḍam̐ gŏluvu seseyiṁtule navvarā