Vinnavimchare yee maada vibhunigim jelulaala

విన్నవించరే యీ మాట విభునికిఁ జెలులాల
Language

(॥పల్లవి॥)
విన్నవించరే యీ మాట విభునికిఁ జెలులాల
పన్ని తనతో నేను పంతము చూపితినా

(॥॥)
చెలఁగి తన కురులు చిక్కులు దీసితిఁ గాక
బలిమి సేసి శిరసు పట్టితినా
వెలయఁ జక్కని తన్ను వేడుకఁ జూచితిఁ గాక
కలికి కన్నుల నిట్టే కడు జంకించితినా

(॥॥)
గట్టిగా ముంజెతఁ గంకణము గట్టితిఁ గాక
దిట్టనై తన చేయి వట్టి తీసితినా
గుట్టు తోడ తనకు నేఁ గొలువు సేసితిఁ గాక
అట్టే తన్నుఁ బోకుండా నాఁ గితినా

(॥॥)
సరుగఁ దన్నుఁ గౌఁగిటఁ జన్నుల నొ త్తితిఁ గాక
బిరుదులు చూపి మోపి పెనఁ గితినా
యిరవై శ్రీ వేంకటేశుఁ డిన్నిఁటా నన్ను నేలె
సరి మెచ్చితిఁ గాక యాసలఁ గొసరితినా

(||pallavi||)
vinnaviṁchare yī māḍa vibhunigim̐ jĕlulāla
panni tanado nenu paṁtamu sūbidinā

(||||)
sĕlam̐gi tana kurulu sikkulu dīsidim̐ gāga
balimi sesi śhirasu paṭṭidinā
vĕlayam̐ jakkani tannu veḍugam̐ jūsidim̐ gāga
kaligi kannula niṭṭe kaḍu jaṁkiṁchidinā

(||||)
gaṭṭigā muṁjĕdam̐ gaṁkaṇamu gaṭṭidim̐ gāga
diṭṭanai tana seyi vaṭṭi tīsidinā
guṭṭu toḍa tanagu nem̐ gŏluvu sesidim̐ gāga
aṭṭe tannum̐ boguṁḍā nām̐ gidinā

(||||)
sarugam̐ dannum̐ gaum̐giḍam̐ jannula nŏ ttidim̐ gāga
birudulu sūbi mobi pĕnam̐ gidinā
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍinnim̐ṭā nannu nelĕ
sari mĕchchidim̐ gāga yāsalam̐ gŏsaridinā