(॥పల్లవి॥)
విన్నవించరే వెలయ నీతనికి
సన్నలాఁ జాయలా జరగదు పొందు
(॥విన్న॥)
కనుగొన చూపులఁ గాంక్షలు దీరవు
కినియనిరతి బెనఁగినఁగాని
మనవులు చెప్పిన మర్మము గరఁగదు
పెనఁ(పెన?) గొని తనువులు బెరసినఁగాని
(॥విన్న॥)
యేతుల నవ్వుల నెనయదు కాఁగిలి
చేతులు పైఁజాఁచినఁగాని
దూతికల కతనఁ దొలఁగవు చలములు
నీతి వినయములు నెరపినఁగాని
(॥విన్న॥)
సేసలు వెట్టిన సిగ్గులు వీడవు
రేసులులేక మీరినఁగాని
యీసరి శ్రీ వేంకటేశుఁడే నన్నేలె
ఆసలు విడువవు అలపులే కాని
(||pallavi||)
vinnaviṁchare vĕlaya nīdanigi
sannalām̐ jāyalā jaragadu pŏṁdu
(||vinna||)
kanugŏna sūbulam̐ gāṁkṣhalu dīravu
kiniyaniradi bĕnam̐ginam̐gāni
manavulu sĕppina marmamu garam̐gadu
pĕnam̐(pĕna?) gŏni tanuvulu bĕrasinam̐gāni
(||vinna||)
yedula navvula nĕnayadu kām̐gili
sedulu paim̐jām̐sinam̐gāni
dūdigala kadanam̐ dŏlam̐gavu salamulu
nīdi vinayamulu nĕrabinam̐gāni
(||vinna||)
sesalu vĕṭṭina siggulu vīḍavu
resululega mīrinam̐gāni
yīsari śhrī veṁkaḍeśhum̐ḍe nannelĕ
āsalu viḍuvavu alabule kāni