Vinnavimchare padigi velamdulaala

విన్నవించరే పతికి వెలఁదులాల
Language

(॥పల్లవి॥)
విన్నవించరే పతికి వెలఁదులాల
సన్నలనే ఆసలెల్లా జాజుకొనెఁ గదరే

(॥విన్న॥)
తలపోసి తలపోసి తమకము దైలువారె
మొలకలై పులకలు మోసులెత్తెను
పిలువఁగాఁ బిలువఁగా ప్రియములు చిమ్మిరేఁగె
కలికి భావము చెప్ప గతలాయఁగదరే

(॥విన్న॥)
యెదురులు చూడఁ జూడ యెదురెక్కఁ గోరికలు
ముదిరి నివ్వెరగులు ముప్పిరిగొని
వెదకఁగా వెదకఁగా వేడుకలు దొట్టుకొనె
సుదతి చందము లింత సూటికెక్కెఁగదరే

(॥విన్న॥)
నవ్వి నవ్వి నట్లానే నాఁటుకొనె మమతలు
వువ్వూళ్లూరి చెమటలు వూటలెత్తెను
ఇవ్వల శ్రీ వేంకటేశుఁ డింతలోనె కూడఁగాను
జవ్వని సంతోసాలు సతమాయఁగదరే

(||pallavi||)
vinnaviṁchare padigi vĕlam̐dulāla
sannalane āsalĕllā jājugŏnĕm̐ gadare

(||vinna||)
talabosi talabosi tamagamu dailuvārĕ
mŏlagalai pulagalu mosulĕttĕnu
piluvam̐gām̐ biluvam̐gā priyamulu simmirem̐gĕ
kaligi bhāvamu sĕppa gadalāyam̐gadare

(||vinna||)
yĕdurulu sūḍam̐ jūḍa yĕdurĕkkam̐ gorigalu
mudiri nivvĕragulu muppirigŏni
vĕdagam̐gā vĕdagam̐gā veḍugalu dŏṭṭugŏnĕ
sudadi saṁdamu liṁta sūḍigĕkkĕm̐gadare

(||vinna||)
navvi navvi naṭlāne nām̐ṭugŏnĕ mamadalu
vuvvūḽlūri sĕmaḍalu vūḍalĕttĕnu
ivvala śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ kūḍam̐gānu
javvani saṁtosālu sadamāyam̐gadare