Vinnavimchare padigi velamdulaala

విన్నవించరే పతికి వెలఁదులాల
Language

(॥పల్లవి॥)
విన్నవించరే పతికి వెలఁదులాల
సన్న యెరిఁగితేఁ దానే సమ్మతించుఁగాక

(॥॥)
దిట్టయైనయట్టివాఁడు తిట్టితేఁ గోపించునా
నట్టనడుమ సెలవి నవ్వుఁగాక
ఱట్టడైనవాఁడు యాఱడి కట్టె లోఁ గునా
జట్టిగొని పైపైని సంతసించుఁ గాక

(॥॥)
కడుజాణఁ డైనవాఁ డు కదిమితే దూరునా
తడయక పిలిచి యాదరించుఁ గాక
చిడుముడి పంతగాఁడు సిగ్గులకు లోనౌనా
విడువని రతులకు వేగిరించుఁ గాక

(॥॥)
వలచినయట్టివాఁడు వాసులెల్లా నెంచునా
కలసి కాఁగిట నించి కైకొనుఁ గాక
యెలమి శ్రీ వేంకటేశుఁ డీతఁ డిట్టె నన్నుఁ గూడె
తలఁపెల్లా నీడేర్చి దక్కియుండుఁ గాక

(||pallavi||)
vinnaviṁchare padigi vĕlam̐dulāla
sanna yĕrim̐gidem̐ dāne sammadiṁchum̐gāga

(||||)
diṭṭayainayaṭṭivām̐ḍu tiṭṭidem̐ gobiṁchunā
naṭṭanaḍuma sĕlavi navvum̐gāga
ṟaṭṭaḍainavām̐ḍu yāṟaḍi kaṭṭĕ lom̐ gunā
jaṭṭigŏni paibaini saṁtasiṁchum̐ gāga

(||||)
kaḍujāṇam̐ ḍainavām̐ ḍu kadimide dūrunā
taḍayaga pilisi yādariṁchum̐ gāga
siḍumuḍi paṁtagām̐ḍu siggulagu lonaunā
viḍuvani radulagu vegiriṁchum̐ gāga

(||||)
valasinayaṭṭivām̐ḍu vāsulĕllā nĕṁchunā
kalasi kām̐giḍa niṁchi kaigŏnum̐ gāga
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
talam̐pĕllā nīḍersi dakkiyuṁḍum̐ gāga