విన్నవించనెట్టు వచ్చు వెలఁదియున్న చంద మిదివో
(॥పల్లవి॥)
విన్నవించనెట్టు వచ్చు వెలఁదియున్న చంద మిదివో
కన్నులార నీవె చూచి గతులు దెలుసుకోవయా
(॥విన్న॥)
తరుణి నిన్నుఁ దలఁచి తలఁచి తమకమాఁప నలవిగాక
శిరసు వంచి చింతలందు చిగురుగోయఁ దొడఁగెను
పురిగొనంగ నిన్నుఁబాసి పొద్దుగడపలేక కెరలి
సరుగ గాలిమంటపమున సాముశాయఁదొడఁగెను
(॥విన్న॥)
వలపు నిలుపలేక కోరికలను తాడు వేఁడిపేఁడి
ఆలరి వేగుదాఁక ముత్తియములు గుచ్చఁ దొడఁగెను
కలయుదాఁక నోర్వలేక కడుఁబరాకు సేసుకొనుచు
నెలఁత తమ్మికొలఁకులకును నీరు నించఁదొడఁగెను
(॥విన్న॥)
దప్పిదేర నీగుణాలు దడవి విరహ మార్చుకొనఁగ
కప్పురఁపుఁ బలుకులెల్ల గాదెఁ బోయఁ దొడఁగెను
యిప్పుడిట్టె శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
చెప్పరాని ననలఁ బూజసేయ నిన్నుఁ దొడఁగెను
(||pallavi||)
vinnaviṁchanĕṭṭu vachchu vĕlam̐diyunna saṁda midivo
kannulāra nīvĕ sūsi gadulu dĕlusugovayā
(||vinna||)
taruṇi ninnum̐ dalam̐si talam̐si tamagamām̐pa nalavigāga
śhirasu vaṁchi siṁtalaṁdu sigurugoyam̐ dŏḍam̐gĕnu
purigŏnaṁga ninnum̐bāsi pŏddugaḍabalega kĕrali
saruga gālimaṁṭabamuna sāmuśhāyam̐dŏḍam̐gĕnu
(||vinna||)
valabu nilubalega korigalanu tāḍu vem̐ḍibem̐ḍi
ālari vegudām̐ka muttiyamulu guchcham̐ dŏḍam̐gĕnu
kalayudām̐ka norvalega kaḍum̐barāgu sesugŏnusu
nĕlam̐ta tammigŏlam̐kulagunu nīru niṁcham̐dŏḍam̐gĕnu
(||vinna||)
dappidera nīguṇālu daḍavi viraha mārsugŏnam̐ga
kappuram̐pum̐ balugulĕlla gādĕm̐ boyam̐ dŏḍam̐gĕnu
yippuḍiṭṭĕ śhrīveṁkaḍeśha nīvu gūḍam̐gānu
sĕpparāni nanalam̐ būjaseya ninnum̐ dŏḍam̐gĕnu