విన్నవించ నేమున్నది విచ్చి విచ్చి ఇందులోను
(॥పల్లవి॥)
విన్నవించ నేమున్నది విచ్చి విచ్చి ఇందులోను
అన్నిటా నీడేరించి ఆదరించు నీవే
(॥॥)
ఆసపడి వున్నదాన నట్టే నీవేమి సేసినా
వేసారుకొంటా నిన్ను వెంగెమాడేనా
నేసవెట్టి పెండ్లాడి సేసుకొన్నవాఁడవు
దోసము రాకుండ మన్నింతువుగాక నీవే
(॥॥)
వలచి వచ్చినదాన వంకలు గుణాలు నుంటే
బలిమిఁ బెనఁగి నిన్ను బండుసేసేనా
చెలిమి సేసి తెచ్చి చేయి వట్టినవాఁడవు
చెలులు నవ్వకుండా రక్షింతుగాక నీవే
(॥॥)
వేళ గాచుకొన్నదాన వేడుక నీవు గూడితే
చాలునంటా బొమ్మలను జంకించేనా
యేలితివి శ్రీవేంకటేశ యింతలోనే నన్ను
మేలు దప్పకుండా నిట్టే మెత్తుగాక నీవే
(||pallavi||)
vinnaviṁcha nemunnadi vichchi vichchi iṁdulonu
anniḍā nīḍeriṁchi ādariṁchu nīve
(||||)
āsabaḍi vunnadāna naṭṭe nīvemi sesinā
vesārugŏṁṭā ninnu vĕṁgĕmāḍenā
nesavĕṭṭi pĕṁḍlāḍi sesugŏnnavām̐ḍavu
dosamu rāguṁḍa manniṁtuvugāga nīve
(||||)
valasi vachchinadāna vaṁkalu guṇālu nuṁṭe
balimim̐ bĕnam̐gi ninnu baṁḍusesenā
sĕlimi sesi tĕchchi seyi vaṭṭinavām̐ḍavu
sĕlulu navvaguṁḍā rakṣhiṁtugāga nīve
(||||)
veḽa gāsugŏnnadāna veḍuga nīvu gūḍide
sālunaṁṭā bŏmmalanu jaṁkiṁchenā
yelidivi śhrīveṁkaḍeśha yiṁtalone nannu
melu dappaguṁḍā niṭṭe mĕttugāga nīve