Vinnavimcha nemidigi veginamtaanu

విన్నవించ నేమిటికి వేగినంతాను
Language

(॥పల్లవి॥)
విన్నవించ నేమిటికి వేగినంతాను
నిన్న నేఁటి సేఁతలెల్లా నీకే సెలవు

(॥విన్న॥)
సిగ్గువడ్డదానఁ గాన చెక్కునఁ జెయివెట్టితే
యెగ్గుపట్ట నేమిటికి నింతలోనే
అగ్గమైన విరహన నలసి వుండినదాన
నిగ్గున నేనెట్టుండినా నీకే సెలవు

(॥విన్న॥)
పాయపుదానఁ గనక పానుపుపై నేనుండితే
ఆయాలంటి నవ్వనేల అందుకుఁగాను
వేయిటికి నేను నీవేళ గాచుకున్న దాన
నీ యిచ్చకొలఁది యిఁక నీకే సెలవు

(॥విన్న॥)
నీ మేలుదానఁ గాన నే నిన్నుఁ గాగిలించితే
చేముట్టి పెనఁగనేల చిమ్మిరేఁగుచు
ఆముక శ్రీవేంకటేశ అన్నిటా నన్నేలితివి
నేమెంత గొసరినాను నీకే సెలవు

(||pallavi||)
vinnaviṁcha nemiḍigi veginaṁtānu
ninna nem̐ṭi sem̐talĕllā nīge sĕlavu

(||vinna||)
sigguvaḍḍadānam̐ gāna sĕkkunam̐ jĕyivĕṭṭide
yĕggubaṭṭa nemiḍigi niṁtalone
aggamaina virahana nalasi vuṁḍinadāna
nigguna nenĕṭṭuṁḍinā nīge sĕlavu

(||vinna||)
pāyabudānam̐ ganaga pānububai nenuṁḍide
āyālaṁṭi navvanela aṁdugum̐gānu
veyiḍigi nenu nīveḽa gāsugunna dāna
nī yichchagŏlam̐di yim̐ka nīge sĕlavu

(||vinna||)
nī meludānam̐ gāna ne ninnum̐ gāgiliṁchide
semuṭṭi pĕnam̐ganela simmirem̐gusu
āmuga śhrīveṁkaḍeśha anniḍā nannelidivi
nemĕṁta gŏsarinānu nīge sĕlavu