విన్నవిఁ గన్నవిఁ గావు నీ పగట్లు
(॥పల్లవి॥)
విన్నవిఁ గన్నవిఁ గావు నీ పగట్లు
పున్నమ వెన్నెల పొళ్ళు పొలఁతి నీ సుద్దులు
(॥విన్న॥)
సారె నేమి బులిసేవే సరసుని యెదుటను
కేరి కేరి నవ్వేవేమే కెలసుకొంటా
వూరకే పెనఁగేవేమే వొడివట్టి తీసుకొంటా
ఆరజపు చేఁత లివి అట్టె నీకేతగునే
(॥విన్న॥)
సన్నలేమి సేసేవే సరి నెదురుగానుండి
చన్నులేమి చూపేవే జంకించుకొంటా
విన్నపాలేమి సేసేవే వేసాలు సేసుకొంటా
వన్నెవెట్టుమేకు లివి వడి నీకే తగునే
(॥విన్న॥)
చేతులేమి చాఁచేవే శ్రీవేంకటేశ్వరు మీఁద
కాతరించేవేమే యాఁకారుకొంటా
యీతఁడే నన్నేలినాఁడు యిందరిలో మన్నించి
యేతరితనాలే పెంచే విది నీకే తగునే
(||pallavi||)
vinnavim̐ gannavim̐ gāvu nī pagaṭlu
punnama vĕnnĕla pŏḽḽu pŏlam̐ti nī suddulu
(||vinna||)
sārĕ nemi buliseve sarasuni yĕduḍanu
keri keri navveveme kĕlasugŏṁṭā
vūrage pĕnam̐geveme vŏḍivaṭṭi tīsugŏṁṭā
ārajabu sem̐ta livi aṭṭĕ nīgedagune
(||vinna||)
sannalemi seseve sari nĕdurugānuṁḍi
sannulemi sūbeve jaṁkiṁchugŏṁṭā
vinnabālemi seseve vesālu sesugŏṁṭā
vannĕvĕṭṭumegu livi vaḍi nīge tagune
(||vinna||)
sedulemi sām̐seve śhrīveṁkaḍeśhvaru mīm̐da
kādariṁcheveme yām̐kārugŏṁṭā
yīdam̐ḍe nannelinām̐ḍu yiṁdarilo manniṁchi
yedaridanāle pĕṁche vidi nīge tagune