Vinnavaaru navveru veṟabu limkemtigi

విన్నవారు నవ్వేరు వెఱపు లిఁకేఁటికి
Language

(॥పల్లవి॥)
విన్నవారు నవ్వేరు వెఱపు లిఁకేఁటికి
నిన్నటి మొన్నటిగుట్టు నేఁడు మా ముందరనా

(॥విన్న॥)
సిగ్గులు వడఁగనేల చింతించ నిఁకనేల
బగ్గన నితఁడు వొడివట్టి తియ్యఁగా
వెగ్గళించి మీ పొందులు వెనక కే ఆయనట
నిగ్గుల మీ మొరఁగులు నేఁడు మాముందరనా

(॥విన్న॥)
చెలుల నడుగనేల చెమరించే భావాలేల
బలిమి నీతఁడు తొడపైఁబెట్టుకోఁగా
తలపడి వొకమాట తనువులు సోఁకెనట
నిలువున మీవేసాలు నేఁడు మాముందరనా

(॥విన్న॥)
వేవేలు విన్నపాలేల వెనకకు వీఁగనేల
శ్రీ వేంకటేశుండితఁడే చేరి కూడఁగా
మా వలెనె నిన్నునిట్టె మన్నించి యేలెనట
నీవింతేసి పెనఁగేది నేఁడు మాముందరనా

(||pallavi||)
vinnavāru navveru vĕṟabu lim̐kem̐ṭigi
ninnaḍi mŏnnaḍiguṭṭu nem̐ḍu mā muṁdaranā

(||vinna||)
siggulu vaḍam̐ganela siṁtiṁcha nim̐kanela
baggana nidam̐ḍu vŏḍivaṭṭi tiyyam̐gā
vĕggaḽiṁchi mī pŏṁdulu vĕnaga ke āyanaḍa
niggula mī mŏram̐gulu nem̐ḍu māmuṁdaranā

(||vinna||)
sĕlula naḍuganela sĕmariṁche bhāvālela
balimi nīdam̐ḍu tŏḍabaim̐bĕṭṭugom̐gā
talabaḍi vŏgamāḍa tanuvulu som̐kĕnaḍa
niluvuna mīvesālu nem̐ḍu māmuṁdaranā

(||vinna||)
vevelu vinnabālela vĕnagagu vīm̐ganela
śhrī veṁkaḍeśhuṁḍidam̐ḍe seri kūḍam̐gā
mā valĕnĕ ninnuniṭṭĕ manniṁchi yelĕnaḍa
nīviṁtesi pĕnam̐gedi nem̐ḍu māmuṁdaranā