Vinnadaamkaa vegira mide naagum

విన్నదాఁకా వేగిర మిదె నాకుఁ
Language

(॥పల్లవి॥)
విన్నదాఁకా వేగిర మిదె నాకుఁ
గన్నదాఁకాఁ గారింపులు

(॥విన్న॥)
కాయో పండోకలికి నీ వందుఁ
బోయివచ్చినట్టి పొరుగుపని
రేయిఁ బగలు నన్ను రేసుల నేఁచిన
పాయపువిభునికిఁ బరిణామా

(॥విన్న॥)
మేడోమాడుగో మెలఁత నీతోడ
నీడుగఁ జెప్పిన యిక్కువలు
వీడని విభుఁడు విన్నప మాలించి
వేడుక నిందాఁకా విచ్చేసెనా

(॥విన్న॥)
చేవో చిగురో చెందిన కౌఁగిట
శ్రీవేంకటేశ్వరు చేఁతలివి
యీవేళ నారతి నెనసి నట్లానె
తావుల నాపొందు దలఁచునా

(||pallavi||)
vinnadām̐kā vegira midĕ nāgum̐
gannadām̐kām̐ gāriṁpulu

(||vinna||)
kāyo paṁḍogaligi nī vaṁdum̐
boyivachchinaṭṭi pŏrugubani
reyim̐ bagalu nannu resula nem̐sina
pāyabuvibhunigim̐ bariṇāmā

(||vinna||)
meḍomāḍugo mĕlam̐ta nīdoḍa
nīḍugam̐ jĕppina yikkuvalu
vīḍani vibhum̐ḍu vinnaba māliṁchi
veḍuga niṁdām̐kā vichchesĕnā

(||vinna||)
sevo siguro sĕṁdina kaum̐giḍa
śhrīveṁkaḍeśhvaru sem̐talivi
yīveḽa nāradi nĕnasi naṭlānĕ
tāvula nābŏṁdu dalam̐sunā