Vinnabamulemi sese veginamtaanu

విన్నపములేమి సేసే వేగినంతాను
Language

(॥పల్లవి॥)
విన్నపములేమి సేసే వేగినంతాను
మన్నించి రక్షించే నీ మహిమలే ఘనము

(॥విన్న॥)
నీవంక నేరమిగద్దా నేనే యపరాధిని
దేవ నే జడుడగాన తెలుసుకోను
వావాత వగురుఁడాడే వాక్యము నీయాధీనము
పావనమైన నీపలుకెల్లా సత్యము

(॥విన్న॥)
మంచితనమెల్లా నీదే మాయదారివాఁడ నేను
చంచలుఁడ గనక విచారించుకోను
అంచల నీదాసుని ఆనతి యమోఘము
యెంచ నీవిచ్చిన వర మెందుకంటే బలువు

(॥విన్న॥)
కరుణెల్లా నీసొమ్ము కఠినచిత్తము నాది
నరుఁడఁ గనక అట్టె అరసుకోను
పరగ మాజనకుని ప్రతిజ్ఞయు నీపంపు
నిరతి శ్రీవేంకటేశ నీపంతము సతము.

(||pallavi||)
vinnabamulemi sese veginaṁtānu
manniṁchi rakṣhiṁche nī mahimale ghanamu

(||vinna||)
nīvaṁka neramigaddā nene yabarādhini
deva ne jaḍuḍagāna tĕlusugonu
vāvāda vagurum̐ḍāḍe vākyamu nīyādhīnamu
pāvanamaina nībalugĕllā satyamu

(||vinna||)
maṁchidanamĕllā nīde māyadārivām̐ḍa nenu
saṁchalum̐ḍa ganaga visāriṁchugonu
aṁchala nīdāsuni ānadi yamoghamu
yĕṁcha nīvichchina vara mĕṁdugaṁṭe baluvu

(||vinna||)
karuṇĕllā nīsŏmmu kaṭhinasittamu nādi
narum̐ḍam̐ ganaga aṭṭĕ arasugonu
paraga mājanaguni pradijñayu nībaṁpu
niradi śhrīveṁkaḍeśha nībaṁtamu sadamu.