Vinnabamu vinavayya vesarugoguvayya

విన్నపము వినవయ్య వేసరుకోకువయ్య
Language

(॥పల్లవి॥)
విన్నపము వినవయ్య వేసరుకోకువయ్య
వెన్న లారగించవయ్య వెస నున్న నుండును(?)

(॥విన్న॥)
కొప్పు జారెఁగదవయ్య కోనతిరువెంగళప్ప
ఇప్పుడే యెవ్వతె నన్ను నంత సేసెను
పిప్పి సేసి మోవి ప్రియాననే తేనె లాని(నె?)
కప్పురు వేసుకొమ్మీ దప్పి గొనకుండును

(॥విన్న॥)
గోరు మేన నున్నదయ్య కోనతిరువెంగళప్ప
యీరీతి నిన్ను నెవ్వెతె ఇంత సేసెను
సారెకుఁ జెమరింపించె చన్నుల నొత్తి మేను
కోరి విసరించుకొమ్మీకొంచి నానకుండును

(॥విన్న॥)
కూడెఁగదయ్య కళలు కోనతిరువెంగళప్ప
యీడనే యెవ్వతె నిన్ను ఇంత సేసెను
వేడుకతోనేలితి శ్రీవేంకటేశుఁడనే నన్ను
వీడెము సేసి నాకిమ్మీ వేసటగాకుండును

(||pallavi||)
vinnabamu vinavayya vesarugoguvayya
vĕnna lāragiṁchavayya vĕsa nunna nuṁḍunu(?)

(||vinna||)
kŏppu jārĕm̐gadavayya konadiruvĕṁgaḽappa
ippuḍe yĕvvadĕ nannu naṁta sesĕnu
pippi sesi movi priyānane tenĕ lāni(nĕ?)
kappuru vesugŏmmī dappi gŏnaguṁḍunu

(||vinna||)
goru mena nunnadayya konadiruvĕṁgaḽappa
yīrīdi ninnu nĕvvĕdĕ iṁta sesĕnu
sārĕgum̐ jĕmariṁpiṁchĕ sannula nŏtti menu
kori visariṁchugŏmmīgŏṁchi nānaguṁḍunu

(||vinna||)
kūḍĕm̐gadayya kaḽalu konadiruvĕṁgaḽappa
yīḍane yĕvvadĕ ninnu iṁta sesĕnu
veḍugadonelidi śhrīveṁkaḍeśhum̐ḍane nannu
vīḍĕmu sesi nāgimmī vesaḍagāguṁḍunu