Vinnabamu seyamane vedugado neegu mammu

విన్నపము సేయమనె వేడుకతో నీకు మమ్ము
Language

(॥పల్లవి॥)
విన్నపము సేయమనె వేడుకతో నీకు మమ్ము
చెన్నుమీరిన ట్టాయింతి చెలలము సుమ్మీ

(॥॥)
చిత్తమురా నీకు నాకె సేవలు సేయనేరుచు
మొత్తముగాఁ బాదాలకు మొక్కనేరుచు
పొత్తుకుఁ దీసి నిన్ను పొగడఁగనేరుచు
ఇత్తల నేమిసేసేవు ఇంటికి రారాదా

(॥॥)
ఇచ్చకము సేసి నిన్ను నియ్యకొలుపనేరుచు
నచ్చుదీర నీతోను నవ్వనేరుచు
పచ్చిసేఁతలను నిన్ను పనిగొననేరుచు
ఇచ్చితివి చనవులు యింటికి రారాదా

(॥॥)
అలమేలుమంగ యీకె అకెఁగూడఁగనేరుచు
పొలఁతి శ్రీ వేంకటేశ భోగించనేర్చు
అలరితి రింతలోనె ఆకె నీవు నిద్దరును
యెలమితో నిట్లానే యింటికి రారాదా

(||pallavi||)
vinnabamu seyamanĕ veḍugado nīgu mammu
sĕnnumīrina ṭṭāyiṁti sĕlalamu summī

(||||)
sittamurā nīgu nāgĕ sevalu seyanerusu
mŏttamugām̐ bādālagu mŏkkanerusu
pŏttugum̐ dīsi ninnu pŏgaḍam̐ganerusu
ittala nemisesevu iṁṭigi rārādā

(||||)
ichchagamu sesi ninnu niyyagŏlubanerusu
nachchudīra nīdonu navvanerusu
pachchisem̐talanu ninnu panigŏnanerusu
ichchidivi sanavulu yiṁṭigi rārādā

(||||)
alamelumaṁga yīgĕ agĕm̐gūḍam̐ganerusu
pŏlam̐ti śhrī veṁkaḍeśha bhogiṁchanersu
alaridi riṁtalonĕ āgĕ nīvu niddarunu
yĕlamido niṭlāne yiṁṭigi rārādā